Balakrishna: నందమూరి అభిమానులకు గుడ్న్యూస్.. ఆ నిర్మాణ సంస్థ బ్యానర్లో బాలయ్య మల్టీస్టారర్ ?..
అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీదున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ సినిమాతో వంద కోట్ల
అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీదున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు బాలయ్య. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. అఖండ సినిమాతో థియేటర్లకు పూర్వ వైభవం వచ్చిందని ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే అఖండ సాధించిన విజయాన్ని చిత్రయూనిట్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి బాలయ్య విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అమ్మవారి దర్శనం పూర్తైన తర్వాత.. మీడియాతో ముచ్చటించిన బాలకృష్ణ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదిరిస్తారని.. ఈ విషయం మరోసారి అఖండ సినిమాతో ప్రూవ్ అయ్యిందని అన్నారు. అంతేకాకుండా.. మరిన్ని మంచి సినిమాలు కూడా జనాల ముందుకు తీసుకువస్తామని.. మంచి స్టోరీ దొరికితే మల్టీస్టారర్ సినిమా చేయడానికి తాను రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. దీంతో బాలకృష్ణ చేయబోయే మల్టీస్టారర్ సినిమాలో తదుపరి హీరో ఎవరనే విషయం చర్చ జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం..బాలకృష్ణ, చిరంజీవి కాంబోలో భారీ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మల్టీస్టారర్ చేయబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఇప్పుడు రాబోయే మల్టీస్టారర్ సినిమా ఏ రెంజ్లో ఉండబోతుందనే విషయం చర్చ జరుగుతోంది.
ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాల హావా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వచ్చిన మల్టీ్స్టారర్ సినిమాలు సూపర్ హిట్ అందుకోగా.. వచ్చే ఏడాది విడుదలయ్యే భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..