Singer Mangli: దూసుకుపోతున్న పుష్ప ఐటెం సాంగ్.. చెల్లెల్లి సక్సెస్ పై సింగర్ మంగ్లీ ఎమోషనల్ పోస్ట్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Singer Mangli: దూసుకుపోతున్న పుష్ప ఐటెం సాంగ్.. చెల్లెల్లి సక్సెస్ పై సింగర్ మంగ్లీ ఎమోషనల్ పోస్ట్..
Singer Mangli
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 16, 2021 | 8:19 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీలోని దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, ఊ అంటావా ఉహు ఉహు అంటావా అనే పాటలు యూట్యూబ్‏లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఊ అంటావా. ఊహు అంటావా సాంగ్ మేనియా నడుస్తోంది. సమంత స్పెషల్ సాంగ్ చేయడం… మత్తు కలిగించే వాయిస్.. అందుకు తగిన లిరిక్స్ ఈ పాటకు సెట్ కావడంతో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్..

ఊ ఉంటావా మావా.. ఊహు అంటావా మావా అంటూ తన మత్తు వాయిస్ తో అందరినీ కట్టిపడేసింది ఫోక్ సింగర్ ఇంద్రావతి.. పాట పాడడం ఒకెత్తు అయితే.. లిరికల్ వీడియోలో ఆమె ఇచ్చిన హావాభావాలు మరో ఎత్తు. ఈ పాటతో ఇంద్రావతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇంద్రావతి ఎవరా అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంద్రావతి ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు. ఇటీవల జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ అక్కచెల్లెల్లు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటను కన్నడలో మంగ్లీ పాడగా.. తెలుగులో ఆమె చెల్లెలు ఇంద్రావతి చౌహన్ పాడింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరూ లైవ్ లో పాడగా.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటతో ఇంద్రావతి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అయితే చెల్లెలు సక్సెస్ కావడంతో మంగ్లీ ఫుల్ ఖుషి అవుతోంది.

ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతాలో చెల్లులు అందుకున్న సక్సెస్ గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది మంగ్లీ. నాలుగు రోజుల్లోనే మూడు కోట్ల వ్యూస్ ను రాబట్టి.. ఊ అంటావా.. ఊ ఊహు అంటావా అనే పాట ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ ఇంద్రావతి. నీ డెబ్యూతోనే ఇంతటి సక్సె్స్ అందుకున్నావ్.. ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలి. దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్ సర్, అల్లు అర్జున్ సర్.. చంద్రబోస్ అన్న ఇలా అందరికీ థ్యాంక్యూ అని మంగ్లీ తన సంతోషాన్ని తెలియజేసింది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

View this post on Instagram

A post shared by Mangli Singer (@iammangli)

Also Read: Anchor Ravi: మీరు చేయాల్సింది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా.. ఏకంగా పోలీసులను ఇంటికి పిలిపించి మరీ రవి కంప్లైంట్..

Siri – Shanmukh: బిగ్‏బాస్ ఇంట్లో మరో అరాచకం.. సిరి ప్రియుడిపై షణ్ముఖ్ అసహనం.. అయిన తప్పుబట్టని సిరి..

Bigg boss 5 Telugu: తన జర్ని వీడియో చూసి ఎమోషనల్ అయిన సిరి.. షణ్ముఖ్..సిరి కంటెంట్ ఇవ్వడానికే వచ్చారంటూ..