Siri – Shanmukh: బిగ్బాస్ ఇంట్లో మరో అరాచకం.. సిరి ప్రియుడిపై షణ్ముఖ్ అసహనం.. అయిన తప్పుబట్టని సిరి..
బిగ్బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. గత రెండుముడ్రోజులుగా బిగ్బాస్ ఇంట్లో జర్నీ వీడియోలను చూసుకుంటూ ఎమోషనల్
బిగ్బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. గత రెండుముడ్రోజులుగా బిగ్బాస్ ఇంట్లో జర్నీ వీడియోలను చూసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో తన జర్ని వీడియో చూసి తెగ సంబరపడిపోయింది సిరి. తన ప్రియుడు చోటు తన జర్ని వీడియోలో కనిపించగానే ఎమోషనల్ అయ్యింది. సిరి. అయితే నిన్నటి అన్ సీన్ వీడియోలో మరో అరాచకం బయటపడింది. అర్దరాత్రి సిరి బయట కూర్చుని ఉండగా.. షణ్ముఖ్ వచ్చి పక్కకు జరుగు కూర్చుంటా అనగానే.. వేరే చోట ప్లేస్ ఉంది కదా.. ఇక్కడే కూర్చువాలా ? అని అలిగిపోయింది సిరి. ఇక సిరి పక్కనే కాస్త ప్లేస్ ఉండడంతో అక్కడే కూర్చున్నాడు షణ్ముఖ్..
ఉన్నదే మూడు నాలుగు రోజులు.. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్.. ఎందుకు సీన్ చేస్తున్నావ్ అని షణ్ముఖ్ అనగా.. ఆ మాటలు నేను అనాలి.. నా పేరు చింపేశావ్.. నీ పేరు చింపితే నీకు తెలిసేది అంటూ అలిగింది సిరి.దీంతో చాల్లేరా.. అలిగింది అని షణ్ముఖ్ అనగానే.. అంతా నీ ఇష్టమే..నీకు నచ్చినప్పుడు మాట్లాడతావ్.. నీకు నచ్చినట్టు చేస్తావ్.. కానీ నేను నాకు నచ్చినట్టు ఉంటా.. ఏదో ట్రిప్ లో ఉన్నా.. చిరాకుగా ఉన్నాను.. కొత్త కొత్తగా ఉంది అని చెప్పుకొచ్చింది సిరి. దీంతో ఎందుకు అలిగావ్ అని షణ్ముఖ్ అడగ్గానే.. నేను అలగలేదు.. ఆలోచిస్తున్నా అని చెప్పింది సిరి. ఫ్యుచర్ గురించి ఆలోచిస్తున్నావా అని అంటే నా గురించి నీకెందుకు అని అంటుంది సిరి. దీంతో షణ్ముఖ్.. నా ఆలోచనలు చెత్త అని పొసిసివ్ అదీ ఇది అని రాస్తున్నారు.. వాటికి నీకేం నొప్పి ఉండదు అంటూ షణ్ముఖ్ అనగా.. నేను రాశానా.. నాకు తెలుసా అంటూ బదులిచ్చింది సిరి.
నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నానా అని అడగ్గా.. నేను కూడా కంట్రోల్ అవుతున్నా అంటే నా తప్పు ఉంది కదా అంటూ చెప్పింది సిరి. కంట్రోల్ చేయడం.. కంట్రోల్ కావడం రెండూ తప్పేగా అని షణ్ముఖ్ అడగ్గా.. నువ్వు ఇచ్చిన వస్తువును నీ ముందే చింపేస్తే ఎలా ఉంటుంది అని సిరి అడగ్గా.. అసలు నువ్వు ఏం ఇచ్చావు అని అడిగాడు షణ్ముఖ్.. దీంతో నీ పేరు పక్కన నా పేరు రాసుకున్నా.. నువ్వు నా పేరు చింపేశావు.. నా బెడ్ దగ్గర నా పేరు లేదు.. నేను ఎలా ఫీల్ అవుతాను అంటూ ఫీల్ అయ్యింది సిరి. ఇక ఆ తర్వాత. రెండు వారాలుగా సన్నీ ఢిపరెంట్ గా కనిపిస్తున్నాడు. వాళ్ల ఫ్రెండ్స్ జన్యూన్ అంటున్నాడు. నన్ను చివరగా పెట్టడం జన్యూన్ గేమ్ అని అడుగుతాడు షణ్ముఖ్. సిరి నన్ను టార్గెట్ చేస్తుంది అంటాడు.. సిరి అంటే రెస్పెక్ట్ ఉంది అంటాడు. మాటల్లో తప్ప చేతల్లో ఉండదు.. ఇదంతా వెళ్లి మీ చోటుకు చెప్పి.. ఫస్ట్ ప్లేస్ ఎలా ఇచ్చావ్.. ఇలాగే ఎంకరేజ్ చేయి అని చెప్పు.. మీకోసం స్టాండ్ తీసుకుంటే.. వేరేవాళ్లకు రెస్పెక్ట్ ఇస్తారంటూ పైర్ అయ్యాడు షణ్ముఖ్. వెళ్లి మీ వాడికి చెప్పు.. తెలియదు కాదా.. మీ వాడికి ఏం జరుగుతుందో ఏమి తెలియదు కాదా… హగ్ చేయడం తప్పు అయితే.. మరి ఇదేంటీ.. ఈ ఇంట్లో నీకు తప్ప మరే అమ్మాయికి స్ట్రెయిట్ హగ్ ఇవ్వలేదు అంటూ షణ్ముఖ్ సిరియస్ అవ్వగా.. సిరి తన ప్రియుడిని తప్పుబడుతున్న మాట మాట్లాడలేదు. ఆ తర్వాత షణ్ముఖ్ మంచం ఎక్కేసి ఒక దుప్పట్లో దురిపోయి.. షణ్ముఖ్ గుండెలపై తల పెట్టుకుని తెగ ఏడ్చేసింది సిరి. ఆ తర్వాత ఆమెను షణ్ముఖ్ ఓదార్చడం మాములే.
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..