Anchor Ravi: మీరు చేయాల్సింది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా.. ఏకంగా పోలీసులను ఇంటికి పిలిపించి మరీ రవి కంప్లైంట్..

Bigg Boss 5 Telugu Anchor Ravi: బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి వెళ్లేవారిని ట్రోల్స్ చేయడం.. వారి గురించి నెగిటివ్ ప్రచారాలు

Anchor Ravi: మీరు చేయాల్సింది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా.. ఏకంగా పోలీసులను ఇంటికి పిలిపించి మరీ రవి కంప్లైంట్..
Anchor Ravi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 16, 2021 | 7:57 AM

Bigg Boss 5 Telugu Anchor Ravi: బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి వెళ్లేవారిని ట్రోల్స్ చేయడం.. వారి గురించి నెగిటివ్ ప్రచారాలు చేయడం సర్వ సాధారణం. తమ అభిమాన కంటెస్టెంట్స్‏కు మద్దతు తెలుపుతూనే తమకు నచ్చని వారి గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం.. వారిని ట్రోల్ చేయడం చేస్తుంటారు. అయితే కేవలం కంటెస్టెంట్ మాత్రమే కొన్నిసార్లు వారి కుటుంబసభ్యుల గురించి కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఈ ట్రోలింగ్‏ను మాత్రం కొందరు సీరియస్ గా తీసుకుంటే.. మరికొందరు అస్సలు పట్టించుకోని..ఇక ఈసారి సీజన్ 5లోనూ కొందరు కంటెస్టెంట్స్ మీద నెగిటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తనపై ట్రోలింగ్ చేసేవారిపై యుద్ధాన్ని ప్రకటించాడు యాంకర్ రవి. బిగ్‏బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను.. తన కుటుంబ సభ్యులను ట్రోలింగ్ చేయడం.. నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వారి గురించి ఆరా తీస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు రవి. తన భార్య, కూతురు మీద ట్రోల్ చేసిన వారి పట్ల సీరియస్ అయ్యాడు రవి.

తనపై..తన కుటుంబంపై ట్రోలింగ్ చేసిన వారిని అస్సలు వదలిపెట్టను అంటూ హెచ్చరించాడు రవి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తమ పరువుకు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చిన వారందరి మీద ఫిర్యాదు చేశాను. ఫేక్, ఫాల్స్ సమాచారాన్ని.. అసభ్య పదజాలంతో నెగిటివిటీని ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేశాను.. కచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకుంటారు. తప్పు మాట్లాడాలి…టైప్ చేయాలంటే భయం పుట్టాలి ఇప్పటి నుంచి అంటూ రవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి యాంకర్ రవి పోలీసులను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది.

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో మరో పోస్ట్ చేశాడు రవి. ఈసారి ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకుని మరీ ఆధారాలు.. స్క్రీన్ షాట్స్ దగ్గరుండి చూపించినట్టుగా కనిపిస్తోంది. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా. కానీ ఒకరికి ఒక నెగిటివ్ కామెంట్, రిప్లై పెట్టే ముందు 30 సెకన్లు ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో చెత్తను క్లీన్ చేద్ధాం.. సోషల్ మీడియాలో దుర్భాషకు వ్యతిరేకంగా పోరాడుదామనే హ్యాష్ ట్యాగులతో రవి పోస్ట్ చేశాడు. అయితే యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించడంపై సపోర్ట్ చేశారు ఆనీ మాస్టర్.

Also Read: Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!