AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Wife: రేపు త్రివిక్రమ్ భార్య సౌజన్య శాస్త్రీయ నృత్య ప్రదర్శన.. ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్..

Trivikram Wife: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల రచయితగా టాలీవుడ్ లో అడుగు పెట్టి.. దర్శకుడిగానూ సంచలన విజయాలు అందుకున్నారు త్రివిక్రమ్..

Trivikram Wife: రేపు త్రివిక్రమ్ భార్య సౌజన్య శాస్త్రీయ నృత్య ప్రదర్శన.. ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్..
Trivikram Wife
Surya Kala
|

Updated on: Dec 16, 2021 | 8:20 AM

Share

Trivikram Wife: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల రచయితగా టాలీవుడ్ లో అడుగు పెట్టి.. దర్శకుడిగానూ సంచలన విజయాలు అందుకున్నారు త్రివిక్రమ్. అతనే కాదు అతని భార్య కూడా మంచి  ప్రతిభావంతురాలు. త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ అనే  శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ నృత్య ప్రదర్శన డిసెంబర్ 2వ తేదీనే జరగాల్సి ఉంది. అయితే సౌజన్య బాబాయ్ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ నాట్య ప్రదర్శన వాయిదా పడింది.

తాజాగా సౌజన్య నాట్య ప్రదర్శన రేపు సాయత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో జరగనుంది. దీనికి పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందిస్తున్నాయి. ఈ మేరకు పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్ గా దైవిక భంగిమలో ఎంతో  మనోహరంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వేడుక కోసం హైదరాబాద్‌లోని త్రివిక్రమ్ అభిమానులు, కళాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా హాజరవుతున్న ఇతర ప్రముఖులు.

త్రివిక్రమ్ , సౌజన్యల పెళ్లి కూడా ఓ సినిమా స్టోరీని తలపిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ పెళ్లి కూడా ఓ సినిమా స్టోరీని తలపిస్తుంది. అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని ఇష్టపడి .. కొంచెం కష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నాడు.  ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

Also Read:   అకస్మాత్తుగా పడిపోయిన టమాటా ధరలు.. రైతులు ఆక్రోశం.. సామాన్యుడికి సంతోషం..