Tomato Price: అకస్మాత్తుగా పడిపోయిన టమాటా ధరలు.. రైతులు ఆక్రోశం.. సామాన్యుడికి సంతోషం..

Tomato Price: నిన్నమొన్నటి వరకూ టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. టమాటా రైతుకు లాభాల పంట పండిచాయి. కొనకుండా సామాన్యులకు కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాటా..

Tomato Price: అకస్మాత్తుగా పడిపోయిన టమాటా ధరలు.. రైతులు ఆక్రోశం.. సామాన్యుడికి సంతోషం..
Tomato Rate
Follow us

|

Updated on: Dec 16, 2021 | 7:51 AM

Tomato Price: నిన్నమొన్నటి వరకూ టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. టమాటా రైతుకు లాభాల పంట పండిచాయి. కొనకుండా సామాన్యులకు కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాటా ధరలు అకస్మాత్తుగా తగ్గుముఖం పట్టాయి. నిన్నా మొన్నటి వరకూ కిలో రూ. 70 నుంచి 80 ఉన్న టమాటా ధర.. నేడు సగానికి సగం పడిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమోటా పంట అధికంగా పండుతుంది. ముఖ్యంగా మదనపల్లిలో టమాటా అధికంగా పండిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటె.. ఒకే.. అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ధర ఉన్న సమయంలో వర్షాలు, వరదలు.. చేతికి పంట అంది వచ్చే సరికి ధర లేకపోవాడంతో అక్కడ టమాటా రైతులు విపరీతంగా నష్టపోతున్నారు.

ఏడాది కూడా రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి టమాటా పంట వేశారు. ఐటీ చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు టమోటా పంట దెబ్బతింది. టమాటా ధర పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల నుంచి టమాటాలు దిగుమతి చేసి..పెరిగిన ధరలను నియంత్రించాయి.

అయితే ఇప్పుడు చిత్తూరు, అనంతపురం జిలాల్లో టమాటా పంట రైతుల చేతికి వచ్చింది. అయితే ఇతర రాష్ట్రాలనుంచి టమాటా దిగుమతి ఉండడంతో.. ఇప్పుడు స్థానిక టమాటా ధర పంటకు ధర వచ్చే పరిస్థితులు లేవు. దీంతో స్థానిక టమాటా పంటకు ధరలు లేక రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నందిగామ మార్కెట్లో టమాటా పంటను పండించిన తాము నష్టపోతుంటే.. కమిషన్ వ్యాపారాలు కోట్లకు పడగలెత్తుతున్నారని రైతులు వాపోతున్నారు. పండించిన తాము నష్టపోతుంటే, ఇతర ప్రాంతాల నుంచి టమోటా దిగుమతి చేసుకుని రైతు బజార్ లలో కమీషన్ పద్దతిపై వ్యాపారం చేసే కమీషన్ దారులు కోట్లకు పడగలెతున్నారు. నందిగామ రైతు బజార్ లో ఇదే పద్దతి కొన్న సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ లలో దళారుల ప్రమేయం పై చర్యలు తీసుకొని, స్థానిక రైతులు పండించే టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రాంత టమోటా రైతులు కోరుతున్నారు.

Also Read:  మనవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఆఫ్రికాలో వింత వ్యాధి.. 100మంది మృతి..

.