Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి తీవ్రత.. గజగజ వణికిస్తున్న చల్ల గాలులు

Cold Weather in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు గజగజ వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.

Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి తీవ్రత.. గజగజ వణికిస్తున్న చల్ల గాలులు
Cold Weather
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 16, 2021 | 8:11 AM

Cold Weather in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు గజగజ వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. అత్యల్పంగా కుమ్రభీం అసిఫాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు విశాఖ జిల్లా లంబసింగి ప్రాంతాల్లో కూడా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులు 8 నుంచి 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్‌ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ, ఏపీ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకూ అదనంగా పెరిగింది.

అటు మధ్య భారతం మీదుగా వస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల చలి పెరిగింది. బుధవారం తెల్లవారుజామున శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో మంచు కురిసింది. అనేకచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయి. విశాఖ ఏజెన్సీలోని పెదబయలులో 11.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో ఈనెల 17న అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి గతం కంటే గణనీయంగా తగ్గింది. కానీ, కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత శీతకాల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా..ఈ చలి కారణంగా శరీర ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయి. ఈ క్రమంలో శరీరంలో ఎక్కువ భాగం కవర్‌ అయ్యే విధంగా దుస్తులు ధరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also… Tomato Price: అకస్మాత్తుగా పడిపోయిన టమాటా ధరలు.. రైతులు ఆక్రోశం.. సామాన్యుడికి సంతోషం..