Venkatesh: ఆ సమయంలో అభిమానులు నిరాశపడ్డారు.. వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్..
ఎఫ్ 3 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే హైదరాబాద్ శిల్పా కళా వేదికలో
విక్టరీ వెంకటేశ్.. మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3 (F3). గతంలో సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 చిత్రానికి సిక్వెల్గా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఎఫ్ 3 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే హైదరాబాద్ శిల్పా కళా వేదికలో శనివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ (Venkatesh) మాట్లాడుతూ.. నారప్ప, దృశ్యం సినిమాలు ఓటీటీలలో విడుదల కావడంతో తన అభిమానులు నిరాశపడ్డారని.. కానీ ఈసారి అలా నిరాశపరచనని.. ఎఫ్ 3 సినిమాతో ట్రీట్ ఇస్తున్నానని తెలిపారు..
“మూడేళ్ల క్రితం నా సినిమా థియేటర్లో విడుదలైంది. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా నారప్ప, దృశ్యం సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి.. థియేటర్లో సినిమా చూడాలని ఎదురుచూసిన అభిమానులు నిరాశపడ్డారు.. ఇప్పుడు వారికీ ఎఫ్ 3 సినిమా మంచి ట్రీట్.. నన్ను అభిమానించి ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.. అనిల్ అద్భుతమైన స్క్రిప్ట్ తో సినిమా చేశారు.. ఇలాంటి సినిమాలను గతంలోనూ ఆదరించారు.. అలాగే ఇప్పుడు ఎఫ్ 3 ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. మే 27న ఎఫ్ 3 సినిమాను థియేటర్లో చూసి ఆనందించండి ” అంటూ చెప్పుకొచ్చారు వెంకీ. అలాగే.. ఎఫ్ 3 సినిమా ప్రారంభించిన తర్వాత రెండు వేసవి కాలాలు అయిపోయాయని.. పూర్తి స్థాయి కామెడీ చిత్రం విడుదలై చాలా రోజులు అయ్యిందని.. వెంకటేశ్ గారితో రెండోసారి మల్టీస్టారర్ గా చేసే అవకాశం నాకు మాత్రమే దక్కిందన్నారు మెగా హీరో వరుణ్ తేజ్. వెంకటేశ్, అనిల్ రావిపూడి వల్ల నాకు ఎఫ్ 3 మరో ప్లస్ అవుతుందన్నారు.