
మెగా ఇంట పెళ్లి సందడి మొదలుకాబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక వీరి నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారని.. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీగానీ.. ఇటు లావణ్య కుటుంబం గానీ స్పందించలేదు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మెగా టీమ్ సోషల్ మీడియా వేదికగా వీరి నిశ్చితార్థం డేట్ ను కన్మామ్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
శుక్రవారం (జూన్ 9న) సాయంత్రం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మెగా హీరోలు అందరూ ఉండాలని అనుకుంటున్నారని.. అందుకే వారి డేట్స్ కు ఇబ్బంది కలగకుండా కన్వినెంట్ గా ఉండేలా ఈ రోజును చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. 2017లో డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ సినిమాలో లావణ్య, వరుణ్ తేజ్ కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం చిత్రంలోనూ కలిసి నటించారు. లావణ్య ఉత్తరప్రదేశ్ లోని అయోద్యకు చెందిన అమ్మాయి. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాంఢీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు చాలా కాలంగా లావణ్య సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తోంది.
The moment we’ve been waiting for has arrived?❤️
It’s official???
Hearty congratulations to
???? ?????? @IAmVarunTej & @Itslavanya on getting Engaged on 9th June, 2023 ??Wishing a lifetime of happiness together✨#VarunTejKonidela #VarunTej #LavanyaTripathi pic.twitter.com/3wyYEb7Zho
— Ravanam Swami naidu (@swaminaidu_r) June 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.