Taraka Ratna: మరికాసేపట్లో ఫిలిం ఛాంబర్‏కు తారకరత్న పార్ధివదేహం.. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

తారకరత్న ఇప్పుడు మన మధ్య లేరన్న వార్త.. వినడానికే భారంగా ఉంది. రాజకీయంగా సరికొత్త అడుగులు మొదలుపెట్టారు. భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న తారకరత్న..ఇప్పుడు చుక్కల్లో కలిసి పోయారు.

Taraka Ratna: మరికాసేపట్లో ఫిలిం ఛాంబర్‏కు తారకరత్న పార్ధివదేహం.. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
Taraka Ratna Last Rites
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 20, 2023 | 9:11 AM

తారకరత్న భౌతికకాయాన్ని కాసేపట్లో ఫిల్మ్‌చాంబర్‌కి తీసుకురాబోతున్నారు. నందమూరి అభిమానుల కడసారి చూసేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపటిక్రితం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మోకిలాలో తారకరత్న భౌతికకాయానికి నివాళి అర్పించారు. నిండా 39 సంవత్సరాల వయసు..ఆప్యాయంగా , ప్రతీ ఒక్కరినీ ప్రేమగా పలకరించే మనస్తత్వం..తారకరత్న ఇప్పుడు మన మధ్య లేరన్న వార్త.. వినడానికే భారంగా ఉంది. రాజకీయంగా సరికొత్త అడుగులు మొదలుపెట్టారు. భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న తారకరత్న..ఇప్పుడు చుక్కల్లో కలిసి పోయారు.

మోకిలాకు చేరుకున్న నందమూరి కుటుంబసభ్యులు, తారకరత్న పార్థివదేహానికి క్రతువు పూర్తి చేశారు. నందమూరి అభిమానుల కోసం మరికాసేపట్లో తారకరత్న పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్‌కు తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత..జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అకాల మరణం చెందడంతో తట్టుకోలేక అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కాళ్లు, చేతుల్లో వణుకు రావడంతో పాటు..కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. అలేఖ్య ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడినట్టుగానే కనిపిస్తోంది. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ బాలకృష్ణ మనోధైర్యం నింపారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చంద్రబాబు, లోకేశ్. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అచేతనంగా పడివున్న కుటుంబ సభ్యుడను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

బాబాయ్‌ బాలకృష్ణ అంటే తారకరత్నకి ఎంతో ఇష్టం. అభిమానం. ఏకంగా ఆయన ఫోటోని భుజంపై టాటూ కూడా వేయించుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో తారకరత్న అనారోగ్యానికి గురి కావడంతో బాలయ్య తల్లడిల్లిపోయారు. ఇప్పుడు చివరి కార్యక్రమాల్లోనూ బాలయ్యనే దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.