Hero Surya : కరోనాను జయించిన స్టార్ హీరో సూర్య.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు..
స్టార్ హీరో సూర్య ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెల్సిందే.. ఈ విషయాన్నీ సూర్య స్వయంగా తెలిపాడు. తమ అభిమాన హీరో కరోనా బారిన పడ్డాడని తెలిసి సూర్య ఫ్యాన్స్ కంగారుపడ్డారు..
Hero Surya : స్టార్ హీరో సూర్య ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెల్సిందే.. ఈ విషయాన్ని సూర్య స్వయంగా తెలిపాడు. తమ అభిమాన హీరో కరోనా బారిన పడ్డాడని తెలిసి సూర్య ఫ్యాన్స్ కంగారుపడ్డారు. అయితే ఇటీవలే సూర్య సోదరుడు హీరో కార్తీ సూర్య హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపాడు. ఇప్పడు నిర్మాత రాజశేఖర్ పాండియన్ సూర్యకు నెగిటివ్ వచ్చిందని, ఇప్పడు ఆయన కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దాంతో అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సూర్య ఇటీవలే ఆకాశం నీహద్దురా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. చాలా కాలం తర్వాత ఈ సినిమా సూర్యకు ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూర్య కెరియర్ లో 40 వ సినిమా. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Drishyam 2 : ‘దృశ్యం 2’ రీమేక్ పై క్లారిటీ వచేసినట్టేనా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..