Drishyam 2 : ‘దృశ్యం 2’ రీమేక్ పై క్లారిటీ వచ్చేసినట్టేనా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా జంటగా నటించిన 'దృశ్యం' సినిమాను తెలుగులో అదే పేరుతో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన విషయం తెలిసిందే...

Drishyam 2 : 'దృశ్యం 2' రీమేక్ పై క్లారిటీ వచ్చేసినట్టేనా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 20, 2021 | 6:38 PM

Drishyam 2 : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ సినిమాను తెలుగులో అదే పేరుతో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  అనుకోని పరిస్థితుల్లో కూతురు ఒక హత్య చేస్తే ఆమె తండ్రి ఆ కేసు నుంచి ఎలా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అన్నే కాన్సెప్ట్ తో దృశ్యం సినిమా సాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠతో ఆకట్టుకుంది ఈ సినిమా. ఇప్పడు మలయాళంలో ఈ సినిమా సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కింది.

ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి పార్ట్ లోని హత్య కేసును ఈ సీక్వెల్ లో తిరగతోడారు. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తెలుగులో ‘దృశ్యం’ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సీక్వెల్ కోసం జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నాడట వెంకీ. 50 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారట .. అయితే నిన్నటివరకు దృశ్యం2 సినిమాను వెంకీ రీమేక్ చేస్తాడా.. చేయడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో తాజాగా  దృశ్యం 2 డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌, నిర్మాత సురేష్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులతో క‌లిసి వెంకీ దిగిన ఫొటో ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో వెంకీ దృశ్యం2 సినిమాను రీమేక్ చేయనున్నాడని అఫీషియల్ గా కన్ఫామ్ అయ్యిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dhanush’Jagame Thanthram’ : స్టార్ దర్శకుడి పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న డిస్టిబ్యూటర్స్.. కారణం ఇదేనా..?