AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swag: ఇదేందయ్యా ఇది! అసలు గుర్తు పట్టలేకుండా మారిపోయిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో తెలుసా?

సినిమా కోసం తమను తాము మార్చుకునే హీరోలు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి సిక్స్ ప్యాక్ పెంచడం, ఫ్యామిలీ ప్యాక్ లాగా లావుగా మారిపోతుంటారు. అలాగే సినిమా కోసం ముసలివారిగా కూడా మారిపోతుంటారు చాలా మంది. పై ఫొటో లో ఉన్న హీరో కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు.

Swag: ఇదేందయ్యా ఇది! అసలు గుర్తు పట్టలేకుండా మారిపోయిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో తెలుసా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 15, 2024 | 9:42 PM

Share

సినిమా కోసం తమను తాము మార్చుకునే హీరోలు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి సిక్స్ ప్యాక్ పెంచడం, ఫ్యామిలీ ప్యాక్ లాగా లావుగా మారిపోతుంటారు. అలాగే సినిమా కోసం ముసలివారిగా కూడా మారిపోతుంటారు చాలా మంది. పై ఫొటో లో ఉన్న హీరో కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు. టాలీవుడ్ కు చెందిన ఈ ట్యాలెంటెడ్ హీరో సినిమా సినిమాకు వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. అందుకే ఇప్పుడిలా గుర్తు పట్టకుండా ముసలివాడిలా మారిపోయాడీ ట్యాలెంటెడ్ హీరో. మరి మీరైనా ఈ హీరోను గుర్తు పట్టారా? కష్టంగా ఉందే.. అతను మరెవరో కాదు ఇటీవలే ఓమ్ భీమ్ బుష్ సినిమాతో ఆడియెన్స్ ను భయపెట్టిన శ్రీ విష్ణు. ఇప్పుడు అతను ‘స్వాగ్‌ సినిమాలో నటిస్తున్నాడు. హసిత్‌గోలి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సినిమాకు సంబంధించి వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు.. భవభూతి అనే స్త్రీ ద్వేషి పాత్రలో కనిపించారు. ఇందులో అతని మేకోవర్, లుక్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఎందుకంటే స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు ముసలి వాడిలా కనిపించనున్నాడు. ఇదొక్కటే కాదు.. సినిమాలో శ్రీ విష్ణు బోలెడు గెటప్పుల్లో కనిపించనున్నాడని ఈ గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. స్వాగ్ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ మరో కీలక పాత్ర పోషించనుంది. దక్షా నగార్కర్ కూడా మరో స్పెషల్ రోల్ లో సందడి చేయనుంది. సినిమా పోస్టర్స్, టీజర్స్ చూస్తుంటే పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సస్వాగ్ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

స్వాగ్ గ్లింప్స్ వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..