AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SonuSood: పైలెట్ పై దాడి చేసిన ప్రయాణికుడు.. సోనూసూద్ ఏమన్నాడంటే

విమానం ఆలస్యమైందని ప్రకటించిన పైలట్‌పై దాడి చేశాడు. 'విమానం స్టార్ట్ చేయండి. లేదంటే 'డోర్ ఓపెన్ చేయండి' అంటూ విమానంలోనే దాడికి దిగిన వీడియో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియోను  ఖండించారు . దీనిపై నటుడు సోనూసూద్ కూడా స్పందించారు.

SonuSood: పైలెట్ పై దాడి చేసిన ప్రయాణికుడు.. సోనూసూద్ ఏమన్నాడంటే
Sonusood
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2024 | 5:03 PM

Share

ఉత్తర భారతదేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలు విమానాల టైంలో మార్పులు వచ్చాయి. ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అసహనానికి గురైన ఓ ప్రయాణికుడు ఘర్షణకు దిగాడు. విమానం ఆలస్యమైందని ప్రకటించిన పైలట్‌పై దాడి చేశాడు. ‘విమానం స్టార్ట్ చేయండి. లేదంటే ‘డోర్ ఓపెన్ చేయండి’ అంటూ విమానంలోనే దాడికి దిగిన వీడియో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియోను  ఖండించారు . దీనిపై నటుడు సోనూసూద్ కూడా స్పందించారు.

‘వాతావరణంపై మనిషికి నియంత్రణ ఉండదు. దాని స్వభావం వేరు. మూడు గంటలపాటు విమానాశ్రయంలో ఓపికగా వేచి ఉన్నారు. అది కష్టమని నాకు తెలుసు. అయితే విమాన సిబ్బందితో ప్రశాంతంగా మాట్లాడాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు’ అని సోనూ సూద్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రజలకు తెలిపారు. విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించే వ్యక్తుల వీడియోలను నేను తరచుగా చూస్తుంటాను. కొన్ని పరిస్థితులు ఎవరి నియంత్రణలో లేనివని అర్థం చేసుకోండి. మనం అందరినీ గౌరవించాలి. విమాన సిబ్బంది వల్ల ఎలాంటి ఆలస్యం జరగదని సోనూసూద్ అన్నారు.

పైలట్‌పై ప్రయాణికుడు దాడి చేసిన వీడియో స్క్రీన్‌షాట్‌ను సోనూ సూద్ షేర్ చేశాడు. ప్రజలు ఇలాగే ప్రవర్తిస్తే, విమాన సిబ్బందికి ఆత్మరక్షణ శిక్షణ తప్పనిసరి అవుతుంది. సోను సూద్ షేర్ చేసిన వీడియో పై ఆయన అభిమానులు, నెటిజన్లు  స్పదిస్తూ సోనూ కామెంట్స్ ను ఏకీభవిస్తున్నారు.. సోనూసూద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాదు అనేక సామాజిక సమస్యలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటాడు.

సోనూసూద్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.