లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యాలు కల్పించడమే కాకుండా.. వారికి ఆర్థికంగా సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన ఎంతోమందికి అపద్భాందవుడయ్యాడు. కరోనా కేసులు తగ్గి.. లాక్డౌన్ ఎత్తివేసినా.. సోనూసూద్ సాయం చేయడం మాత్రం ఆపలేదు. భాషతో సంబంధం లేకుండా.. దేశ వ్యాప్తంగా ఎంతో మందికి తన వంతు సహాయాన్ని చేస్తున్నాడు. కరోనా రోగులకు చికిత్స ఖర్చుల నుంచి ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలెటర్స్ ఇలా ఎన్నో సహాయాలను అందిస్తున్నాడు. సోనూసూద్ ద్వారా సాయం పొందిన వారు మాత్రమే కాకుండా.. సామాన్య ప్రజలు సైతం ఆయనను దైవంగా భావిస్తూ.. పూజిస్తున్నారు. తమ వ్యాపార సంస్థలకు, పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే ఇప్పటివరకు ఎన్నో సేవ కార్యక్రమాలను కొనసాగిస్తోన్న సోనూసూద్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2022లో నిర్వహించనున్న బృహన్ ముంబాయి మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున సోనూసూద్ పోటీ చేసే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సెలబ్రిటీలను ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ముఖ్ తనయుడు, నటుడు రితేష్ దేశ్ముఖ్, మోడల్, ఫిట్నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్ నిలిచారని టాక్ వినిపించింది. త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. తాజాగా సోనూసూద్ ఈ విషయంపై స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని తెలిపారు. ఆ వార్తల్లో నిజం లేదు. సాధారణ వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటూ స్పష్టం చేశారు. దీంతో సోనూసూద్ రాజకీయా్లోకి రావాలని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు వద్దని చెబుతున్నారు.
ట్వీట్…
Not true,
I am happy as a common man ?? https://t.co/w5665MqAwc— sonu sood (@SonuSood) August 24, 2021
హీరోయిన్ కోసం వచ్చి చిక్కుల్లో పడ్డ హీరో.. ఆకట్టుకుంటోన్న ఇచ్చట వాహనాలు నిలుపరాదు మూవీ ట్రైలర్..