గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ , ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి , ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు , ఎమ్మెల్యే బత్తుల బలరాం, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ , ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన్ను ఇలా చూడటంతో నాకు మాటలు రావడం లేదు. ఆయన్ను ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ చరిత్రలో నిలవబోతోంది. ఆయన రావడమే ఈ ఈవెంట్‌కు ప్రత్యేకత. నా జీవితంలో ఏ ఆర్ రెహమాన్, పవన్ కళ్యాణ్ గారు నా ఆలోచనా ధోరణిని మార్చేశారు. ఖుషి కథ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్పులు చెప్పారు. ఓ పాటను, మూడు ఫైట్లను యాడ్ చేశారు. మాట ఇస్తే నిలబడాలి అని పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ గారు రెండు పాత్రల్లో అదరగొట్టేశారు. శంకర్ గారు విజన్, తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. రామ్ చరణ్‌తో నాకు ఉండే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పర్ఫామెన్స్‌కు అవార్డు వస్తుందని సుకుమార్ గారు చెప్పారు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ ఇరగ్గొట్టేశారు. సంక్రాంతికి రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
అంజలి మాట్లాడుతూ.. ‘రాజమండ్రిలో ఈవెంట్ జరుగుతుంటే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడి నుంచే వెళ్లి హీరోయిన్‌గా మారి.. మళ్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ కోసం ఇలా రావడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారెతో వకీల్ సాబ్‌లో పని చేశాను. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎదిగారు. ఈ రోజు మాకోసం ఆయన రావడం ఆనందంగా ఉంది. నటిగా డిఫరెంట్ పాత్రలను చేయాలని అందరికీ ఉంటుంది. నా తల్లి పేరు పార్వతి. ఈ చిత్రంలో నేను పోషించిన కారెక్టర్ నేమ్ పార్వతి. నాకు ఈ కారెక్టర్ చాలా టచ్ అయింది. నాకు ఇంత మంచి పాత్రను రాసిన, ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. రామ్ చరణ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఇక్కడకు వచ్చిన ఆడియెన్స్, అభిమానులకు థాంక్స్. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి’ అని అన్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.