Simbu: శింబు గొప్ప మనసు.. ప్రమాదంలో చనిపోయిన స్టంట్ మాస్టర్ ఫ్యామిలీ కోసం ఏం చేశాడో తెలుసా?

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో అందరినీ కదిలించిన సంఘటన స్టంట్ మాస్టర్ మోహన్‌రాజ్ మరణం. వెట్టువం సినిమా షూటింగ్ లో ఓ కార్ స్టంట్ చేస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు మోమన్ రాజ్. దీంతో అతని కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Simbu: శింబు గొప్ప మనసు.. ప్రమాదంలో చనిపోయిన స్టంట్ మాస్టర్ ఫ్యామిలీ కోసం ఏం చేశాడో తెలుసా?
Simbu

Updated on: Jul 25, 2025 | 7:45 AM

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. శింబు లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ మిక్స్ డ్ టాక్ అందుకుంది. అభిమానుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించాల్సిన ‘STR 49’ చిత్రం కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడిందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం వెట్రిమారన్‌తో దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు శింబు. దీంతో పాటు ఇప్పటికే STR 50, 51 వంటి చిత్రాలకు కూడా సంతకం చేశాడీ కోలీవుడ్ స్టార్ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమను ఒక సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే వెట్టువం చిత్రం స్టంట్ మాస్టర్ మోహన్రాజ్ మరణం. సినిమా షూటింగ్ లో కార్ స్టంట్ చేస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు మోహన్ రాజ్.భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్టంట్ చేసినప్పటికీ మోహన్ రాజ్ ప్రాణాలు దక్కలేదు. అతని మరణం మొత్తం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఈ విషయంలో దర్శకుడు పా. రంజిత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు . మోహన్ రాజ్ మరణం తర్వాత, సినిమాల్లో స్టంట్ మాస్టర్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. .

ఈ క్రమంలో నటుడు శింబు స్టంట్ మాస్టర్ మోహన్‌రాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారట. మరో స్టంట్ డైరెక్టర్ సిల్వా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టాడు. దీంతో శింబుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతకు ముందు మరో ప్రముఖ నటుడు విశాల్ కూడా మోహన్ రాజ్ కుటంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మోహన్ రాజ్ కుటుంబానికి లక్ష రూపాలయ ఆర్థిక  సాయం అందజేసన హీరో శింబు..

హీరో విశాల్ కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..