
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో సిద్దు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులోని డైలాగ్స్.. క్యాచీ పంచ్‌లు జనాలను ఆకట్టుకున్నాయి. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో అట్లుంటది మరి మనతోని అంటూ డీజే డైలాగ్ వాడేసాడు. ఇక ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో.. ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. డీజే టిల్లు చిత్రానికి మించి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో దీపావళి పండగను పురస్కరించుకుని డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టైటిల్ ప్రకటించారు మేకర్స్.
టైటిల్ రిలీవ్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు ఆ చిత్ర నిర్మాణ సంస్త సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ సినిమా సీక్వెల్ కు ‘టిల్లు స్క్వేర్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈసారి డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందట. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.
అయితే డీజే టిల్లు చిత్రానికి హీరోయిన్ కాదు.. డైరెక్టర్ కూడా చేంజ్ అయ్యారు. మొదటి చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన వీడియో కామెడీగా ఉండగా.. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Meet our Starboy @Siddu_buoy ~ TILLU, Back with Double the Fun, Double the Romance, Double the Madness ??#TilluSquare title Reveal ▶️ https://t.co/cRT1DPuXqX @anupamahere @MallikRam99 @Ram_Miriyala @vamsi84 @NavinNooli @SaiprakashU @NavinNooli pic.twitter.com/fYmM8tNImH
— Sithara Entertainments (@SitharaEnts) October 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.