Ayalaan Trailer: శివకార్తికేయన్ ‘అయలాన్’ ట్రైలర్ రిలీజ్.. భూమిని కాపాడే ఏలియన్ కథే..

ఇక ఇప్పుడు ఈ హీరో అయలాన్ సినిమాతో మరోసారి జనాల ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. భూమ్మీద ఉన్న జీవరాశులను నాశనం చేయడానికి విలన్ ప్రయత్నిస్తుంటాడు.

Ayalaan Trailer: శివకార్తికేయన్ 'అయలాన్' ట్రైలర్ రిలీజ్.. భూమిని కాపాడే ఏలియన్ కథే..
Ayalaan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2024 | 1:35 PM

కోలీవుడ్ హీరో శివకార్తికేయను సినిమాల కోసం తెలుగు అడియన్స్ సైతం ఎదురుచూస్తుంటారు. రెమో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చివరగా ప్రిన్స్ సినిమాతో నేరుగా టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించిన ఈ సినిమా పర్వలేదనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ హీరో అయలాన్ సినిమాతో మరోసారి జనాల ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. భూమ్మీద ఉన్న జీవరాశులను నాశనం చేయడానికి విలన్ ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో వాటిని కాపాడేందుకు ఏలియన్ భూమిపైకి వస్తుంది. అయితే భారతదేశంలో దిగిన ఏలియన్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది.. హీరో శివకార్తికేయన్ జీవితంలోకి ఏలియన్ ఎలా వచ్చింది.. వీరిద్దరి మధ్య స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో శివకార్తికేయన్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఇషా కొప్పికర్, శరత్ కేల్కర్, భాను ప్రియ, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ అందించడం విశేషం. అలాగే ఈ సినిమా కోసం హీరో సిద్ధార్థ్, శివకార్తికేయన్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ.. ప్రొడ్యూసర్స్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొవడంతో అనేకసార్లు ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.