సీనియర్ హీరోయిన్ స్నేహకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషా చిత్రాల్లో ఫ్యామిలీ గర్ల్ లుక్‌లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తొలివలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. సంప్రదాయ లుక్ లో కనిపిస్తూ చాలా కాలం అగ్రకథానాయికగా కొనసాగింది.