
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నారు. ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. ఇక ఇప్పుడు విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరంజీవి. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆతర్వాత ఆయన తిరిగి సినిమాల్లోకి వచ్చి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ గురించి ఓ నటుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రాణించాలని కొంతమంది అభిమానులు కోరుకున్నారు. అలాగే మెగాస్టార్ సినిమాల్లో నటించి రాణించాలని చాలా మంది అభిమానులు కోరుకున్నారు. తాజాగా ఓ నటుడు మాత్రం చిరంజీవి సరైన సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే కచ్చితంగా సీఎం అయ్యేవారు అని ఆయన అన్నారు. ఆయన ఎవరో కాదు నటుడు శివాజీ. ఒకప్పుడు సినిమాల్లో హీరోగా, సెకండ్ హీరోగా రాణించిన శివాజీ.. ఆతర్వాత గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారారు. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొని ఆకట్టుకున్నారు.
శివాజీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయ ప్రవేశానికి సరైన సమయం కుదరలేదేమోనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శివాజీ మాట్లాడుతూ.. మేబీ సరైన టైమ్‌లో అన్నయ్య రాజకీయాల్లోకి రాలేదేమో అని నాకు అనిపించింది. నాకు డివిజన్ తర్వాత అన్నయ్య వచ్చి ఉంటే.. గన్ షాట్ సీఎం అయ్యేవాళ్లేమో అనిపించింది నాకు. అంతే. అని పేర్కొన్నారు. అంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, ముఖ్యమంత్రి పదవిని ఖచ్చితంగా చేపట్టేవారని శివాజీ అన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.