Maha Samudram: మహాసముద్రంలో శర్వానంద్ మజిలీ ముగిసింది.. ఇక విడుదల ఎప్పుడంటే..

| Edited By: Ravi Kiran

Oct 05, 2021 | 7:17 PM

ప్రస్తుతం టాలీవుడ్‏లో సినీ జాతర నడుస్తోంది. సెకండ్ వేవ్ అనంతరం సినిమా షూటింగ్స్‏లో వేగం పెంచిన దర్శకనిర్మాతలు..

Maha Samudram: మహాసముద్రంలో శర్వానంద్ మజిలీ ముగిసింది.. ఇక విడుదల ఎప్పుడంటే..
Maha Samudram
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్‏లో సినీ జాతర నడుస్తోంది. సెకండ్ వేవ్ అనంతరం సినిమా షూటింగ్స్‏లో వేగం పెంచిన దర్శకనిర్మాతలు.. ఒక్కొక్కరిగా తమ చిత్రాలను పూర్తి చేసుకునే… ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్స్ చివరిదశలో ఉండగా.. మరికొన్ని సినిమాలు చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇక హీరోలు సైతం..తన సినిమాలకు డబ్బింగ్ ప్రక్రియను కూడా పూర్తిచేసేస్తున్నారు. తాజాగా టాలెంటెడ్ హీరో శర్వానంద్ కూడా తన లేటేస్ట్ సినిమా కోసం వేగం పెంచాడు.

టాలెంటెడ్ హీరో శర్వానంద్, యంగ్ హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం మహాసముద్రం. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా.. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రొటిన్ కథల మాదిరిగా కాకుండా.. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‏లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే.. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ సైతం వేగవంతం చేశారు మేకర్స్.

తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ తన డబ్బింగ్ పూర్తిచేసుకున్నారు. ఈ విషయాన్ని శర్వానంద్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా.. ఈనెల 14న ఈ సినిమా విడుదల కాబోతుందని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Akhanda : షూటింగ్ పూర్తి చేసుకున్న అఖండ.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Mumbai Cruise Drug Case: బాలీవుడ్ బాద్ షాకు బాలీవుడ్‌ మద్దతు.. షారుక్‌ ఖాన్‌ ఇంటికి క్యూ కట్టిన ప్రముఖులు

Samantha: సామ్-చైతూ విడాకులపై స్పందించిన సమంత తండ్రి.. ఏమన్నారంటే..