శర్వాకు ముక్కలైన కుడిభుజం ఎముక..11 గంటల పాటు ఆపరేషన్

టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు టాలీవుడ్‌లో సపరేట్ బ్రాండ్ ఉంది. అతను ఏ సినిమా సినిమా అందులోని కథా, కథానాలలో వైవిధ్యం ఉంటుంది. అందుకే తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా శర్వా ’96’ సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన ’96’కు రీమేక్.. ఈ సినిమా కోసం థాయిలాండ్‌లో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. శిక్షణ సమయంలో ప్రమాదవశాత్తూ శ‌ర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన […]

శర్వాకు ముక్కలైన కుడిభుజం ఎముక..11 గంటల పాటు ఆపరేషన్
Follow us

|

Updated on: Jun 18, 2019 | 6:45 PM

టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు టాలీవుడ్‌లో సపరేట్ బ్రాండ్ ఉంది. అతను ఏ సినిమా సినిమా అందులోని కథా, కథానాలలో వైవిధ్యం ఉంటుంది. అందుకే తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా శర్వా ’96’ సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన ’96’కు రీమేక్.. ఈ సినిమా కోసం థాయిలాండ్‌లో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.

శిక్షణ సమయంలో ప్రమాదవశాత్తూ శ‌ర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు కుడి భుజం భాగంలోని ఎముక డిస్‌లొకేట్ అవ్వడంతో పాటు ముక్కలు కావడంతో..దానికి శస్త్ర చికిత్స చేశామన్నారు డా. గురవా రెడ్డి. ఆఫరేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ‌ర్వానంద్‌తో తనకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని..తమ కుటుంబ స‌భ్యుడిగా భావిస్తుంటానని చెప్పారు. అయితే దుర‌దృష్టవశాత్తు థాయ్‌లాండ్‌లో జ‌రిగిన ప్రమాదంలో ఆయన భుజం భాగంలోని ఎముక విరిగి ఐదారు ముక్కలైందని..దీంతో ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామన్నారు.

నాలుగు గంట‌ల పాటు ఆపరేషన్ చేశామని చెప్పిన ఆయన.. మరో ఐదు గంట‌ల పాటు ప్లాస్టిక్ స‌ర్జరీ చేశామని…దీనికి తోడు ఆప‌రేష‌న్ త‌ర్వాత మూడు గంట‌ల పాటు అబ్జర్వేష‌న్‌లో ఉంచామని చెప్పారు. అయితే కుడి భుజానికి గాయమవడంతో చెయ్యి మామూలు స్థితికి రావడానికి కొంత స‌మ‌యం ప‌డుతుందన్నారు. మరో రెండు నెలల పాటు శర్వానంద్ ఎటువంటి షూటింగ్‌లో పాల్గొనలేరని..ఈ లోపు ఫిజియో థెరపి..ఇతర పద్దతులు ద్వారా ఆయన చేయి మాములు స్థితికి వస్తోందని గురవా రెడ్డి తెలిపారు.

Latest Articles