Adipurush: హిందీలో ప్రభాస్‏కు వాయిస్ ఇచ్చింది ఎవరో తెలుసా ?.. అప్పుడు బాహుబలికి.. ఇప్పుడు ఆదిపురుష్..

|

Oct 02, 2022 | 9:22 PM

భూమి కుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Adipurush: హిందీలో ప్రభాస్‏కు వాయిస్ ఇచ్చింది ఎవరో తెలుసా ?.. అప్పుడు బాహుబలికి.. ఇప్పుడు ఆదిపురుష్..
Adipurush Prabhas
Follow us on

నార్త్‏లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు డార్లింగ్. ప్రభాస్ లుక్స్.. రాజసం.. నటన చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమాతో డార్లింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు చేతినిండా భారీ బడ్జెట్ చిత్రాలతో ఫుల్ బిజీ అయ్యారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ యంగ్ రెబల్ స్టార్ తో సినిమాలు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రభాస్ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఆదివారం సాయంత్రం ఫుల్ విజువల్ వండర్ ఇచ్చేశారు డైరెక్టర్ ఓంరౌత్. కాసేపటి క్రితం విడుదలైన ఆదిపురుష్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ లోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

కానీ హిందీలో తన పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదు. నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్ లో ప్రబాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. గతంలో బాహుబలి చిత్రం సమయంలోనూ డార్లింగ్ పాత్రకు ఆయనే వాయిస్ ఓవర్ అందించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 2న అయోధ్య వేదికగా విడుదల చేసింది చిత్రయూనిట్.\

ఇవి కూడా చదవండి

Sharad Kelkar

భూమి కుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.