RamaRao ON Duty: రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడింగ్.. మాస్ మాహారాజా లుక్ అదుర్స్..

తాజాగా 'రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడ్ అవుతుందని. త్వరలోనే నిర్మాతలు ట్రైలర్ ని విడుదల చేయనున్నారట. ట్రైలర్ లోడింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ క్లాస్

RamaRao ON Duty: రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడింగ్.. మాస్ మాహారాజా లుక్ అదుర్స్..
Raviteja
Follow us

|

Updated on: Jul 09, 2022 | 9:13 PM

మాస్ మాహారాజా రవితేజ (Raviteja ).. డైరెక్టర్ శరత్ మండవ కాంబోలో వస్తోన్న లేటేస్ట్ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Rama Rao On Duty). ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ చేయనున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ తో అంచనాలు మరింత పెరిగాయి.

ఇక తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడ్ అవుతుందని. త్వరలోనే నిర్మాతలు ట్రైలర్ ని విడుదల చేయనున్నారట. ట్రైలర్ లోడింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ క్లాస్ అండ్ స్టైలిష్ గా ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రవితేజ తహశీల్దార్‌గా కనిపించనున్నారు. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ యూనిట్ ప్రమోషన్స్ ని భారీగా చేస్తోంది.