AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayam Ravi: ఇద్దరూ ఒకే సిగరెట్ తాగుతూ.. మరోసారి అడ్డంగా దొరికిపోయిన జయం రవి- కెనీషా.. వీడియో వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి మరోసారి వార్తల్లో నిలిచారు. అతనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ హీరో జయం రవి పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Jayam Ravi: ఇద్దరూ  ఒకే సిగరెట్ తాగుతూ.. మరోసారి అడ్డంగా దొరికిపోయిన జయం రవి- కెనీషా.. వీడియో వైరల్
Jayam Ravi
Basha Shek
|

Updated on: Sep 07, 2026 | 7:03 PM

Share

కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి ఇప్పుడు ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాు. ముఖ్యంగా గతేడాది నుంచి భార్యతో విడాకుల వివాదంతో తరచూ వైరల్ టాపిక్ గా మారుతున్నాడు. ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇద్దరు కొడుకులు జన్మించినప్పటికీ.. భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం, అదే సమయంలో ప్రముఖ సింగర్ కెనీషాతో చెట్టాపట్టాలేసుకోని తిరగడంత జయం రవిపై తీవ్రమైన నెగెటివిటీని తెప్పిచాయి. ప్రస్తుతం భార్యతో విడాకుల వివాదం కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. అయితే ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టిన జయం రవి విడాకులు మంజురయ్యే వరకు సినిమాల్లో నటించని ప్రకటన కూడా చేశాడు. అదే సమయంలో సింగర్ కెనీషా కూడా రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్‌ చెబుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఇద్దరూ జంటగా కనిపించారు రవి- కెనీషా. తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా వెళ్లొచ్చారు. తాజాగా ఇప్పుడీ ప్రేమ జంట మళ్లీ బుక్ అయ్యారు. అది కూడా ఒక సిగరెట్ ఇద్దరూ కలిసి తాగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

ఈ వీడియోలో జయం రవి, కెనీషా ఇద్దరు చాలా క్యాజువల్ లుక్ లో కనిపించారు. వారితో పాటు మరికొందరు కూడా ఈ వీడయోలో ఉన్నారు. ఏదో గ్రూపు మీటింగ్ లో సీరియస డిస్కషన్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోలో జయం రవి సిగరెట్ తాగడం, ఆ తర్వాత దానిని కెనీషా కు ఇవ్వడం.. ఆమె కూడా దానిని పీల్చడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన ఒక నెటిజన్ .. ‘ విడాకుల వార్త బయటపడినప్పుడు మేము జయం రవి కి మద్దతుగా నిలిచాము. అతనికి అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చాం. ఎందుకంటే అతని వాదనను మేం మనస్ఫూర్తిగా నమ్మాం. కానీ ఇప్పుడు అతని వీడియోలు చూశాక వాస్తవ పరిస్థితి అర్థం అయింది. ముఖ్యంగా పరిస్థితులు, అసలు వాస్తవాలు ఇలా మారుతుండడం చూసి మేం తీవ్ర నిరాశ చెందాం. ముఖ్యంగా ఈ వీడియోల వల్ల రవి సార్ పై ఉన్న గౌరవం కూడా పోయింది’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్య ఆర్తితో విడాకుల వివాదం కేసు ఇంకా కోర్టులో నడుస్తుండగానే జయం రవి ఇలా చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ వీడియోపై జయం రవి కానీ, కెనీషా కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us