పనిమనిషికి ఆస్తి రాసిచ్చి.. వంటగదిలో ఉరి వేసుకున్నారు.. అసలు విషయం చెప్పిన రంగనాథ్ కొడుకు
తెలుగుతెరపై తన మార్క్‌ను చాటుకున్న విలక్షణ నటుడు రంగనాథ్. ఎంతో సున్నిత మనస్తత్వం ఆయన సొంతం. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1974లో ‘చందన’ సినిమాతో రంగనాథ్‌కు హీరోగా అవకాశం లభించింది. అనంతరం దాదాపు 40 నుంచి 50 చిత్రాల్లో కథానాయకుడిగా చేశారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. దాదాపు దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు.

సీనియర్ నటుడు రంగనాథ్.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఎంతో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఎంతో అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్న రంగనాథ్ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యేలా చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. అలాగే ఆయన ఆస్తి మొత్తం పనిమనిషికి రాసి ఇచ్చారు. అంత పెద్ద నటుడు అయినప్పటికీ ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన కొడుకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన విషయాలు బయటపెట్టారు.
నటుడు రంగనాథ్ కుమారుడు నాగేంద్ర కుమార్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు, రంగనాథ్ మరణం తరువాత నెలకొన్న వివాదాలు, వదంతులపై వివరణ ఇచ్చారు. రంగనాథ్ తన భార్య చనిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలను కాదని, తన ఆస్తిని పనిమనిషి మీనాక్షి పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకోవడం పై నాగేంద్ర కుమార్ మాట్లాడారు. మీనాక్షి మహిళ తమ కుటుంబంలో 2003-2004 నుండి దాదాపు ఆరు సంవత్సరాలు పని చేసిందని, తన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను అంకితభావంతో చూసుకుందని నాగేంద్ర కుమార్ గుర్తు చేసుకున్నారు. రాత్రిపూట కూడా తన తల్లి అవసరాలను మీనాక్షి తీర్చిందని, ఆమె తమ కుటుంబానికి ఎంతో సేవ చేసిందని ఆయన తెలిపారు. మీనాక్షి పనిమీద బయటకు వెళ్లిన అరగంట, నలభై ఐదు నిమిషాల్లోనే రంగనాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు నాగేంద్ర కుమార్ వివరించారు.
రంగనాథ్ వంటగదిలో ఉరి వేసుకున్నారని, అక్కడ డోంట్ డిస్టర్బ్ మీనాక్షి అని గోడపై రాసి ఉందని చెప్పారు. తన తండ్రి మీనాక్షిని జీవితంలో స్థిరపడటానికి సహాయం చేయాలనుకున్నారేమో అని నాగేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు, కానీ తమకు ఈ విషయమై తండ్రి నేరుగా ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు. తన తల్లి, తండ్రిని మీనాక్షి ఎంతో శ్రద్ధగా చూసుకున్నందుకు, ఆమెకు డబ్బులు ఇచ్చి ఇంటి దగ్గర దించి, ఆమె కాళ్ళ పైన పడి దండం పెట్టానని, ఆమె రుణం తీర్చుకోలేనని నాగేంద్ర కుమార్ ఎంతో కృతజ్ఞతతో తెలిపారు. తన తండ్రి ఆత్మహత్య తరువాత, ప్రెస్ మరియు ప్రజల నుండి తమ కుటుంబం తీవ్ర నిందలు ఎదుర్కొందని నాగేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




