Sukumar: ఆడియెన్స్‌లో ఆ హీరోయిన్ క్రేజ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైన సుకుమార్
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కార్యక్రమంలో రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయి పల్లవిల గురించి ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడారు. రష్మికను శ్రీవల్లిగా, కీర్తి సురేష్‌ను జాతీయ అవార్డు గ్రహీత మహానటిగా కొనియాడారు. సాయి పల్లవి గురించి మాట్లాడుతూ, ఆమెను లేడీ పవన్ కళ్యాణ్‌గా పేర్కొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది తమిళ భామ సాయి పల్లవి. ముఖంపై ఏ మాత్రం మేకప్ లేకున్నా కుందనపు బొమ్మలా ఈ హీరోయిన్.. నేచురల్ బ్యూటీ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంది. త్వరలో హిందీ డెబ్యూల్ కూడా ఇవ్వబోతుంది. తండేల్ తర్వాత ఆమె మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. అయితే సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా..? టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్. శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఈ క్రమంలో స్టేజ్‌పై ఉన్న హీరోయన్ల గురించి ప్రస్తావిస్తూ ఉండగా.. సాయి పల్లవి పేరు పలకగానే ఆడియెన్స్ అంతా కేకలు, అరుపులతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. కొన్ని సెకన్ల పాటు అలా అరుస్తూనే ఉన్నారు. దీంతో సుకుమార్ బహుశా మీరు లేడీ పవన్ కల్యాణ్ అనుకుంటా అని సాయి పల్లవితో అన్నారు. అలా ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు వచ్చేసింది.
