AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యం, ఇమ్యూనిటీ కోసం పరగడుపున అదొక్కటి తింటే చాలు.. సీక్రెట్ చెప్పేసిన స్టార్ నటి

చూడటానికి ఎంతో సుకుమారంగా కనిపించినా, వ్యాయామం విషయంలో మాత్రం ఆమె ఒక రోల్​ మోడల్​. నిత్యం యోగా, జిమ్ వర్కవుట్లతో తన సోషల్ మీడియాలో స్ఫూర్తిని నింపే ఆ బాలీవుడ్ నటి, తాజాగా తన మార్నింగ్ రొటీన్‌కు సంబంధించిన ఒక వింత అలవాటును పంచుకుంది.

ఆరోగ్యం, ఇమ్యూనిటీ కోసం పరగడుపున అదొక్కటి తింటే చాలు.. సీక్రెట్ చెప్పేసిన స్టార్ నటి
Bollywood Star....
Nikhil
|

Updated on: Jan 28, 2026 | 9:15 AM

Share

సాధారణంగా ఉదయాన్నే నిమ్మరసం, తేనె లేదా గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ ఈమె మాత్రం అందరికీ భిన్నంగా ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను నమిలి తింటోంది. ఆ ఘాటైన వాసన, మండే రుచిని సైతం భరిస్తూ ఆమె ఎందుకు వెల్లుల్లిని తీసుకుంటోంది? కేవలం కొన్ని వారాల నుంచి పాటిస్తున్న ఈ చిన్న మార్పు తన శరీరంలో ఎలాంటి మ్యాజిక్ చేసిందో ఆమె స్వయంగా వెల్లడించింది. ఇంతకీ సోహా అలీ ఖాన్ నమ్ముతున్న ఆ ప్రాచీన వైద్య రహస్యం ఏంటి? వెల్లుల్లిని ఎలా తీసుకుంటే ఫలితం ఉంటుందో తెలుసుకుందాం..

వెల్లుల్లి మంత్రం..

ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. గత కొన్ని వారాలుగా తను ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటున్నట్లు ఆమె తెలిపారు. ఇది ప్రాచీన జ్ఞానం అని, ఇప్పటికీ ఇది అద్భుతంగా పనిచేస్తుందని ఆమె నమ్ముతున్నారు. ఈ అలవాటు వల్ల తన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడిందని సోహా వివరించారు. వెల్లుల్లిని ఊరికే మింగేయడం కంటే నమిలి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సోహా చెబుతున్నారు. వెల్లుల్లిని నమిలినప్పుడు అందులో ఉన్న ‘అల్లిసిన్’ అనే సమ్మేళనం యాక్టివేట్ అవుతుంది. వెల్లుల్లిలో ఉండే శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ఈ అల్లిసిన్ ప్రధాన కారణం. ఒకవేళ నమలడం కష్టంగా అనిపిస్తే, వెల్లుల్లిని ముక్కలుగా కోసి లేదా దంచి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి, ఆ తర్వాత నీటితో కలిపి తీసుకోవాలని ఆమె సూచించారు.

Soha Ali Khan (2)

Soha Ali Khan (2)

ప్రయోజనాలు.. జాగ్రత్తలు..

వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వాతావరణం మారుతున్న సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. పచ్చి వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం వల్ల ప్రేగులలో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది, తద్వారా జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది. శరీరంలో వచ్చే వాపులు, నొప్పులను తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా సెన్సిటివ్ స్టొమక్ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని నేరుగా తీసుకుంటే కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ప్రారంభించడం మంచిది. సింపుల్ గా అనిపించే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే మనల్ని పెద్ద పెద్ద రోగాల నుంచి కాపాడతాయని సోహా అలీ ఖాన్ నిరూపించారు. ఘాటుగా ఉన్నా సరే ఆరోగ్యం కోసం ఈ ‘ప్రాచీన జ్ఞానాన్ని’ పాటించడానికి ఆమె మొగ్గు చూపుతున్నారు.