AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RaviTeja Diet Secrets: ఈ వయసులో రవితేజ అంత ఎనర్జిటిక్‌గా ఎలా! మాస్ మహారాజా పాటిస్తున్న ఆ ‘గోల్డెన్ రూల్’ ఏంటో తెలుసా?

వయసు 50 దాటినా ఆయన ఎనర్జీలో ఏమాత్రం మార్పు ఉండదు. స్క్రీన్ మీద ఆయన ఇచ్చే స్పీడ్, డ్యాన్స్‌లో చూపే జోరు చూస్తుంటే కుర్ర హీరోలకు సైతం చెమటలు పట్టాల్సిందే. టాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోల్లో ఆయన కూడా ఒకరు.

RaviTeja Diet Secrets: ఈ వయసులో రవితేజ అంత ఎనర్జిటిక్‌గా ఎలా! మాస్ మహారాజా పాటిస్తున్న ఆ ‘గోల్డెన్ రూల్’ ఏంటో తెలుసా?
Ravitejaa
Nikhil
|

Updated on: Jan 28, 2026 | 9:32 AM

Share

సాధారణంగా సెలబ్రిటీలు డైట్ అంటే ఏదో రకమైన కఠినమైన నియమాలు పాటిస్తారని మనం అనుకుంటాం. కానీ ఈ మాస్ మహారాజా మాత్రం చాలా సింపుల్, కానీ ఒక సైంటిఫిక్ పద్ధతిని పాటిస్తున్నారు. ఆయన డైట్ ప్లాన్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే టైమింగ్స్ ఆయనకు అస్సలు ఉండవు. తన బాడీకి ఎప్పుడు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అసలు రవితేజ పాటిస్తున్న ఆ వింత డైట్ ఏంటి? ఆయన అంత యంగ్‌గా కనిపించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?

గడియారం చూసి కాదు..

రవితేజ అనుసరించే అతి ముఖ్యమైన నియమం ఒక్కటే.. “బాడీకి నిజంగా ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవడం”. చాలామంది ఉదయం 8 అయింది కదా అని టిఫిన్, మధ్యాహ్నం 1 అయింది కదా అని భోజనం చేస్తుంటారు. కానీ రవితేజ మాత్రం గడియారాన్ని అస్సలు పట్టించుకోరు. తన మెదడు ఇచ్చే హంగర్ సిగ్నల్స్ ఆధారంగానే ఆయన భోజనం చేస్తారు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై అనవసరమైన భారం పడదు. రవితేజ రోజుకు కేవలం మూడు సార్లు మాత్రమే ఘనాహారం తీసుకుంటారు.

Fitness Of Rt

Fitness Of Rt

ప్రతి భోజనానికి మధ్య కనీసం రెండున్నర నుంచి మూడు గంటల సమయం ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల మన శరీరం తీసుకున్న పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. “మనం ఏం తింటున్నాం అనే దానికంటే, మన శరీరం దేనిని అరిగించుకుంటోంది అనేదే ముఖ్యం” అనేది ఆయన ఫిలాసఫీ. ఈ పద్ధతి వల్ల కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా, మెటబాలిజం చురుగ్గా మారుతుంది.

View this post on Instagram

A post shared by T Manohar (@ursfitmanohar)

ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యం అని రవితేజ నమ్ముతారు. ఒకవేళ మీరు బాగా తిని రోజంతా కూర్చుని ఉంటే, అది నేరుగా కొవ్వుగా మారి కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే ఆయన స్ట్రెంత్ ట్రైనింగ్ లేదా రెసిస్టెన్స్ వర్కవుట్స్ తప్పనిసరిగా చేస్తారు. కండరాలు దృఢంగా ఉంటేనే శరీరం హార్మోన్ల పరంగా, మెటబాలిక్ పరంగా యంగ్‌గా పని చేస్తుందని ఆయన నిరూపించారు.

రవితేజ ఒక ఆసక్తికరమైన సూత్రాన్ని నమ్ముతారు.. “మజిల్స్ ఆర్ యూత్” (కండరాలే యవ్వనం). మన శరీరంలో లీన్ మజిల్ ఎంత ఎక్కువగా ఉంటే, మన అవయవాలు అంత మెరుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల చూడటానికి మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా బాడీ చాలా బలంగా మారుతుంది. ట్రెండ్స్ వెంట పడకుండా తన శరీరానికి ఏది అవసరమో దానినే ఆయన అనుసరిస్తున్నారు. కఠినమైన డైట్ కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని రవితేజ మరోసారి నిరూపించారు. కష్టపడి వర్కవుట్ చేయడం, తెలివిగా తినడం, శరీరం ఇచ్చే సిగ్నల్స్ వినడం.. ఇవే రవితేజ ఫిట్‌నెస్ సీక్రెట్స్.

మజిల్ పెంచుకోవడానికి రవితేజ చేస్తున్న ఈ ట్రిక్‌ మామూలుది కాదు
మజిల్ పెంచుకోవడానికి రవితేజ చేస్తున్న ఈ ట్రిక్‌ మామూలుది కాదు
ఆ సమాధిని 900 ఏళ్లుగా చెప్పులు, బూట్లు, రాళ్లతో కొడతూనే ఉన్నారు!
ఆ సమాధిని 900 ఏళ్లుగా చెప్పులు, బూట్లు, రాళ్లతో కొడతూనే ఉన్నారు!
ఆ హీరోయిన్ క్రేజ్ చూసి నివ్వెరపోయిన సుకుమార్..
ఆ హీరోయిన్ క్రేజ్ చూసి నివ్వెరపోయిన సుకుమార్..
అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్‌
అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్‌
పనిమనిషికి ఆస్తి రాసిచ్చి.. వంటగదిలో ఉరి వేసుకున్నారు..
పనిమనిషికి ఆస్తి రాసిచ్చి.. వంటగదిలో ఉరి వేసుకున్నారు..
దటీజ్ ప్రభాస్‌.. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు
దటీజ్ ప్రభాస్‌.. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు
పట్టుపరికిణిలో క్యూట్ ఫోజులు.. మీనాక్షి అదిరిపోయే ఫొటోస్
పట్టుపరికిణిలో క్యూట్ ఫోజులు.. మీనాక్షి అదిరిపోయే ఫొటోస్
స్టార్ నటి హెల్త్, ఇమ్యూనిటీ సీక్రెట్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
స్టార్ నటి హెల్త్, ఇమ్యూనిటీ సీక్రెట్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వెజిటబుల్ ఇదే!
ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వెజిటబుల్ ఇదే!
ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు.. OTT లో రిలీజ్ అయ్యే సినిమాలు
ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు.. OTT లో రిలీజ్ అయ్యే సినిమాలు