R Madhavan: జాతీయ రికార్డ్ బద్దలు కొట్టిన తనయుడు.. ఎప్పుడూ చెప్పకు అంటూ ట్వీట్ చేసిన మాధవన్..

|

Jul 18, 2022 | 5:27 PM

16 ఏళ్ల వేదాంత్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో 16:01.73 సెకన్లలో 16:06.43 సెకన్ల రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

R Madhavan: జాతీయ రికార్డ్ బద్దలు కొట్టిన తనయుడు.. ఎప్పుడూ చెప్పకు అంటూ ట్వీట్ చేసిన మాధవన్..
R Madavan
Follow us on

స్టార్ హీరో మాధవన్ ప్రస్తుతం రాకెట్రీ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో ఒదిగిపోయాడు మాధవన్. తాజాగా మాధవన్ తనయుడు వేదాంత్ 48వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‏షిప్‏లో జాతీయ రికార్డ్ బద్దలు కొట్టారు. 16 ఏళ్ల వేదాంత్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో 16:01.73 సెకన్లలో 16:06.43 సెకన్ల రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా తన తనయుడి క్రియేట్ చేసిన రికార్డ్ పై స్పందించాడు హీరో మాధవన్. తన కొడుకు స్విమ్మింగ్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటూ ఎప్పుడూ చెప్పకు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

“ఎప్పుడూ చెప్పకు కాదు అని.. 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో జాతీయ జూనియర్ రికార్డ్ బద్దలు కొట్టినట్లు ” అంటూ రాసుకొచ్చారు. మాధవన్ షేర్ చేసిన వీడియోపై హీరో ఆర్య, ఖుష్బూ సుందర్, రాధిక శరత్ కుమార్ స్పందిస్తూ వేదాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్‌లో, వేదాంత్ డానిష్ ఓపెన్ 2022లో స్విమ్మింగ్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. కీర్తి సురేష్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ మాధవన్ తనయుడిపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.