Prakash Raj: మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్

|

Sep 24, 2024 | 6:41 PM

ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ ఈ దీక్ష చేపట్టారు పవన్. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు.

Prakash Raj: మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్
Pawan Kalyan
Follow us on

తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డు వివాదం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ ఈ దీక్ష చేపట్టారు పవన్. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. తాజాగా విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లను శుభ్రం చేశారు పవన్. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. కొందరు లడ్డు అపచారం పై పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు. లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే.. ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు.? ఆయన ఏం సంబంధం.? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్. నేను ఇంకో మతాన్ని నిందించానా.? దీని గురించి మాట్లాడుతుంటే .. మాట్లాడొద్దు అని అంటున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా.? అని పవన్ ఫైర్ అయ్యారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆలాగే ఓ ట్వీట్ కూడా చేశారు. పవన్‌ నా వ్యాఖ్యలను పవన్‌ అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెబితే మీరు మరోలా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా..ఈ నెల 30 తర్వాత వచ్చి  మీరు అన్న ప్రతి మాటకు సమాధానం చెబుతా.. మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ ఓ వీడియోను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ క్రేజ్ మాత్రం పీక్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

ప్రకాష్ రాజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.