AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Sreenu: ‘ఇండస్ట్రీలో నాకన్నీ ప్రభాసే.. మా ఇద్దరి స్నేహం అలా మొదలయ్యింది’.. ప్రభాస్ శ్రీను కామెంట్స్..

కేవలం నటుడిగానే కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితుడిగా.. డార్లింగ్ అసిస్టెంట్‏గా.. అన్నింటికి మించి స్నేహితుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రభాస్ శ్రీను.. డార్లింగ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ వీరిద్దరి పరిచయం ఎలా జరిగింది ?... వీరి స్నేహం ఎక్కడి నుంచి మొదలయ్యింది ?అనేది చాలా మందికి తెలియదు. తాజాగా ఓ షోలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను.. తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకోవడమే కాదు.. ప్రభాస్ తో తన స్నేహం గురించి కూడా చెప్పుకొచ్చాడు.

Prabhas Sreenu: 'ఇండస్ట్రీలో నాకన్నీ ప్రభాసే.. మా ఇద్దరి స్నేహం అలా మొదలయ్యింది'.. ప్రభాస్ శ్రీను కామెంట్స్..
Prabhas Sreenu, Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 12, 2023 | 3:28 PM

Share

ప్రభాస్ శ్రీను.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. 20 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్‏గానే కాదు.. విలన్‏గా.. సహాయ నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. కేవలం నటుడిగానే కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితుడిగా.. డార్లింగ్ అసిస్టెంట్‏గా.. అన్నింటికి మించి స్నేహితుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రభాస్ శ్రీను.. డార్లింగ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ వీరిద్దరి పరిచయం ఎలా జరిగింది ?… వీరి స్నేహం ఎక్కడి నుంచి మొదలయ్యింది ?అనేది చాలా మందికి తెలియదు. తాజాగా ఓ షోలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను.. తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకోవడమే కాదు.. ప్రభాస్ తో తన స్నేహం గురించి కూడా చెప్పుకొచ్చాడు.

దాదాపు రెండు దశాబ్దాలలో 300 సినిమాలు ఎలా చేయగలిగారు ? అని అడగ్గా.. “దర్శకుల సహకారం వల్లే ఇది సాధ్యమైంది. నా కామెడీ టైమింగ్ నచ్చి వాళ్లు అవకాశాలు ఇచ్చారు. వచ్చిన వాటిలో నేను రాత్రిపగలు కష్టపడి నటించాను. ” అని అన్నారు. అలాగే.. ప్రభాస్ తో పరిచయం గురించి చెబుతూ.. “సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్లో నాకు ప్రభాస్ పరిచయం. అప్పుడు అక్కడ నన్ను చూసి ప్రభాస్, సత్యానంద్ నవ్వుకునేవారు. నాకు ఆ శిక్షణలో ఉన్నప్పుడే ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఏం రాలేదు. దాంతో నిరాశకు గురయ్యాను. అప్పుడు ప్రభాస్ తనతోనే ఉండమని చెప్పాడు. అలా మా పరిచయం మొదలైంది. అక్కడ చాలా మంది శ్రీనులు ఉన్నారు. కానీ ఎక్కువగా ప్రభాస్ తో ఉండేసరికి ప్రభాస్ శ్రీను అనడం స్టార్ట్ చేశారు. అలా నా ప్రేరు ప్రభాస్ శ్రీను అయ్యింది. నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా.. ఏదైనా షేర్ చేసుకునేది మాత్రం ముందుగా ప్రభాస్ తోనే.. నాకు అన్నీ ఆయనే” అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ప్రభాస్ కు త్వరగా కోపమొస్తుందని.. ఆ సమయంలో ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్ అయిపోతారని.. అసలు ఎందుకు కోపమొచ్చిందనే విషయం ఎవరికీ అర్థం కాదని అన్నారు. ఆయనను మళ్లీ మాములు మనిషిని చేయడానికి చాలా టాలెంట్ కావాలని.. ఆ టాలెంట్ తన దగ్గర ఉంది కాబట్టే ప్రభాస్ దగ్గర ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!