Prabhas Sreenu: సీనియర్ నటి తులసితో రూమర్స్ పై స్పందించిన ప్రభాస్ శ్రీను..

|

Jun 12, 2023 | 8:22 PM

సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను సన్నిహితంగా ఉంటున్నారని.. కొన్నాళ్ల క్రితం వీరిద్దరి గురించి అనేక రూమర్స్ వైరలయ్యాయి. శ్రీనుని డార్లింగ్ అని తులసి పిలవడంత ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తమ గురించి వస్తోన్న వార్తలపై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు. కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీను ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

Prabhas Sreenu: సీనియర్ నటి తులసితో రూమర్స్ పై స్పందించిన ప్రభాస్ శ్రీను..
Prabhas Sreenu, Tulasi
Follow us on

తెలుగు సినీపరిశ్రమలో కమెడియన్, విలన్, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్ శ్రీను. దాదాపు రెండు దశాబ్దాల సినీప్రయాణంలో 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు స్నేహితుడు కూడా. ఇండస్ట్రీలోకి తనకు అన్ని ప్రభాసే అని.. ఏదైనా విషయం తనతోనే ముందుగానే చెబుతానని అన్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను సన్నిహితంగా ఉంటున్నారని.. కొన్నాళ్ల క్రితం వీరిద్దరి గురించి అనేక రూమర్స్ వైరలయ్యాయి. శ్రీనుని డార్లింగ్ అని తులసి పిలవడంతో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తమ గురించి వస్తోన్న వార్తలపై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు. కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీను ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

“తులసిగారితో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ మా మీద చాలా వార్త పత్రికలు రూమర్స్ రాశాయి. ఆవిడ నాకు తల్లితో సమానం. డార్లింగ్ సినిమా సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి.. ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని.. చాలా అపార్థం చేసుకున్నారు. మాపై రూమర్స్ వచ్చినప్పుడు మొదట ఆవిడే నాకు మెసేజ్ పెట్టారు. ఇలా రాశారు .. మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా అపార్థం చేసుకుంటుందేమోనని.. నా భార్య డాక్టర్. ఆ రూమర్స్ చూసి ఇద్దరం నవ్వుని వదిలేశాం. తులసి గారంటే నాకు చాలా గౌరవం. ఆవిడ ఎప్పుడూ పూజలకు సంబంధించిన మెసేజ్ లే పెడుతుంటారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే ప్రభాస్ పెళ్లి గురించి స్పందిస్తూ.. జరిగేది ఎప్పటికైనా జరుగుతుందని.. ఆరోజు అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇప్పటి నుంచే ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడుకోవడం అని అన్నారు. ప్రభాస్ రాజు అయితే నువ్వు మంత్రి అని కృష్ణంరాజు అంటుండేవారని.. దీపావళి వస్తే ఆ ఇంట్లో సందడి చూడడానికి రెండు కళ్లు చాలవని అన్నారు.