బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు ప్రభాస్.. దీంతో డార్లింగ్‌తో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసపాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా గడిపేస్తున్నాడు. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ రూపొందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ లాంగ్ షెడ్యూ్ల్ ముంభైలో ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ దాదాపు ఇరవైఅయిదు రోజులపాటు జరుగుతుందని సమాచారం. ఇందులో ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేసినట్లుగా టాక్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన రిహార్సల్స్ కూడా ప్రారంభించారట ప్రభాస్. ముందుగా యాక్షన్ సీన్స్, ఆ తర్వాత టాకీ పార్ట్ చిత్రీకరిస్తారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మైథాలజీ ఫిల్మ్‌లో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు . ఇక ప్రభాస్.. పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..