యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అంటే ఠక్కున గుర్తొ్చ్చేది జాతిరత్నాలు సినిమా. జోగిపేట శ్రీకాంత్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా మంచి టాక్ అందుకోవడమే కాకుండా.. నటనపరంగానూ మంచి మార్కులు కొట్టేసాడు. ఇక కరోనా సంక్షోభంతో దాదాపు ఎక్కువగా థియేటర్లు మూతపడి ఉన్న సమయంలో జాతిరత్నాలు (JathiRatnalu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా.. నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ కెవి అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నవీన్ పోలిశెట్టితోపాటు.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలకపాత్రలలో నటించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా పరిచయమైంది.
స్వప్న సినిమా బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా గతేడాది మార్చి 11న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ విడుదలై నిన్నటితో ఏడాది పూర్తైంది. జాతి రత్నాలు చిత్రయూనిట్ సినిమా విడుదలైన రోజును గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అందరూ తమ జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. తాజాగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు..
“జాతి రత్నాలు సినిమా విడుదలై సంవత్సరమయ్యింది. ఈ మూవీ విడుదలయ్యే సమయానికి వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా అప్పటికే చాలా వరకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా విడుదలైంది. ఆ సమయంలో ప్రేక్షకులు మా పై చూపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిస్తున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి కష్టపడి పనిచేస్తా.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కడివే ఎలా రా ఇండస్ట్రీలో అంటూ మా నాన్న నాతో చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోను. కానీ ఈరజు మీ అందర్నీ చూస్తుంటే నేను ఒంటరినని అనుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకులంతా మనతో ఉన్నారు అనే ధైర్యం ఉంది.. మానసికంగా నిరాశకు గురైనప్పుడు మా సినిమా తమలో ఎంతో ఆనందాన్ని నింపిందని ఇప్పటికీ ప్రేక్షకులు మేసేజ్ చేస్తున్నారు. మా సినిమా మరింతగా మీ జీవితంలో నవ్వులు పూయించాలని కోరుకుంటున్నాను ” అంటూ నవీన్ పోలిశెట్టి కామెంట్స్ చేశాడు.
ట్వీట్..
1 year since blockbuster #JathiRatnalu today. No vaccination back then. Theatres were shutting down. This video is a glimpse of what we saw. Euphoria, mass hysteria, endless laughter. All thanks to u guys. MY family. I will work very hard to entertain & give back the same love ❤️ pic.twitter.com/M133kq1cdQ
— Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2022
Anasuya Bharadwaj: బుల్లితెర అయిన వెండితెరకు అయిన తగ్గని అందాల ‘అనసూయ’ జోరు..(ఫొటోస్)