దసరా సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు నాని. శ్రీకాంత్ ఓదేల తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ తర్వాత నాని నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం హాయ్ నాన్న. నాని కెరీర్ లో 30వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకుర్ కథానాయికగా నటిస్తుండగా.. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో వస్తోన్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. అయితే చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. గతంలో మూవీ టైటిల్ రిలీజ్ చేస్తూ మేకర్స్ షేర్ చేసిన గ్లింప్స్ ఆక్టటుకుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.
తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు నాని. ఈ మూవీలోని మొదటి పాటను రిలీజ్ చేస్తామని.. అప్పటివరకు ఎదురుచూస్తూ ఉండండి అంటూ రాసుకొచ్చారు. అందులో సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ చూపించలేదు. అలాగే ఎప్పుడూ సాంగ్ రిలీజ్ చేస్తారనేది చెప్పలేదు. ప్రస్తుతం నాని షేర్ చేసిన వీడియో మాత్రం ఆసక్తిని పెంచేసింది.
This album will sweep you off your feet 🙂
Let’s start with a song for now ♥️#HiNanna
Stay tuned… pic.twitter.com/exd5Fn0zL8— Nani (@NameisNani) September 13, 2023
జెర్సీ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించి మెప్పించాడు నాని. ఇక ఇప్పుడు మరోసారి తండ్రిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం మృణాల్ తెలుగు నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే.
Happy birthday yashna. Have a wonderful one ♥️
From
Me and Mahi 🙂@MissThakurani #HiNanna pic.twitter.com/hGtOAGhdD8— Nani (@NameisNani) August 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.