AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మా ఫ్యామిలీలో ఎక్కువ ఆస్తులు ఉన్నది ఆయనకే: నందమూరి చైతన్య కృష్ణ

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చైతన్య కృష్ణ కూడా ఒకడు. ధమ్, బ్రీత్ సినిమాల్లో హీరోగా నటించిన అతను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నందమూరి హీరో తమ కుటుంబ ఆస్తుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మా ఫ్యామిలీలో ఎక్కువ ఆస్తులు ఉన్నది ఆయనకే: నందమూరి చైతన్య కృష్ణ
Nandamuri Chaitanya Krishna
Basha Shek
|

Updated on: Jan 26, 2026 | 5:58 PM

Share

సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా అరంగేట్రం చేశాడు నందమూరి చైతన్య కృష్ణ. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో మొదటి సారిగా నటించాడు చైతన్య కృష్ణ. దీని తర్వాత చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు. అయితే 2023లో మళ్లీ బ్రీత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ ఇండస్ట్రీకి దూరమైపోయాడీ నందమూరి హీరో. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు చైతన్య కృష్ణ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నందమూరి హీరో తమ కుటుంబ ఆస్తుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నందమూరి తారక రామారావు వారసత్వ ఆస్తుల్లో భాగంగా మాకు రామకృష్ణ 70ఎంఎం థియేటర్ వచ్చింది. సికింద్రాబాద్‌లో ఉండే ఈ థియేటర్ లో ఎక్కువగా హిందీ సినిమాలను ప్రదర్శించే వారు. మానాన్న ( నందమూరి జయకృష్ణ) కుటుంబ ఆస్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. రామకృష్ణ 70 ఎంఎం థియేటర్, 35ఎంఎం థియేటర్, హోటల్, స్టూడియో వంటి వాటిని చూసుకున్నారు. తాత ఎన్టీఆర్ శంషాబాద్‌లో 250 ఎకరాల ఫామ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. దానిని కూడా నాన్నే చూసుకున్నారని, అయితే తర్వాత దాన్ని అమ్మేశారు. సాయికృష్ణ రామకృష్ణ 35ఎంఎం, రామకృష్ణ గ్లిటరేటి థియేటర్‌లను నిర్వహిస్తుండగా, హరి బాబాయ్ హోటల్‌ను, మోహన్ తారక రామ థియేటర్‌ను చూసుకుంటున్నారు. ఇక స్టూడియో బాధ్యతలను పూర్తిగా రామకృష్ణ బాబాయ్ కే అప్పజెప్పారు’

ఇవి కూడా చదవండి

‘ఇక స్టూడియోలో మాత్రం అందరూ భాగస్వాములుగా ఉన్నారు. చిన్న బాబాయ్ జయశంకర్ కృష్ణకు చెన్నైలోని బజుల్లా రోడ్‌లో ఒక ఇల్లు ఉంది. అలాగే స్టూడియోలో ల్యాండ్, భవనం కూడా ఆయన పేరిట ఉన్నాయి. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు మారినందున చెన్నైలోని టీ. నగర్ ఇంటిని మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ వస్తువులతో కూడిన పెద్ద మ్యూజియం అమరావతిలో నిర్మించడానికి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారు. దీనికి సుమారు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం’ అని నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

నారా లోకేశ్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతోన్న నందమూరి చైతన్య కృష్ణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us