AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : పెద్దిలో విలన్ ఎవరు.. ? స్టోరీ లైన్ ఇదే.. అంచనాలు పెంచేసిన బుచ్చిబాబు కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). ఈ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈక్రమంలో కొన్ని రోజులుగా ప్రమోషన్లలో పాల్గొంటున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

Peddi Movie : పెద్దిలో విలన్ ఎవరు.. ? స్టోరీ లైన్ ఇదే.. అంచనాలు పెంచేసిన బుచ్చిబాబు కామెంట్స్..
Buchibabu
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 3:54 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘ఉప్పెన’ సినిమా విడుదల కాకముందే, కోవిడ్ సమయంలో ఆ చిత్రం ఓటీటీలో వస్తుందా, థియేటర్లలో వస్తుందా అనే టెన్షన్ ఉన్నప్పుడు బుచ్చిబాబు తన రెండో సినిమా లైన్ అనుకున్నారట. పిఠాపురంలోని దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని.. “సెకండ్ ఫిలిం హీరో రామ్ చరణ్, క్యారెక్టర్ పేరు పెద్ది, హీరో బెల్లం ఫ్యాక్టరీలో పని చేస్తాడు” అని ఒక డైరీలో రాసుకున్నట్లు బుచ్చిబాబు వెల్లడించారు. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే చరణ్‌తో సినిమా అనుకోవడం దేవుడి స్క్రీన్ ప్లే అని ఆయన అన్నారు.

రామ్ చరణ్ అనగానే అందరికీ ‘రంగస్థలం’ గుర్తుకొస్తుందని, మళ్లీ అలాంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయడం తన ముందున్న అతిపెద్ద సవాల్ అని బుచ్చిబాబు పేర్కొన్నారు. అయితే, ‘పెద్ది’ చూస్తున్నప్పుడు ఎక్కడా రంగస్థలం షేడ్స్ కనిపించవని, ఇది పూర్తిగా వేరే స్టైల్ అని ఫస్ట్ షెడ్యూల్స్ చూసినప్పుడే స్పష్టమైందని చెప్పారు. సినిమాలో చరణ్ గెటప్ ఒక ప్రత్యేకమైన తెగకు (జాతికి) సంబంధించినదిగా ఉంటుందని, అందుకే ఆయన నోస్ రింగ్ (ముక్కు పుడక) పెట్టుకున్నారని క్లారిటీ ఇచ్చారు. చరణ్ బాడీ లాంగ్వేజ్ చాలా మాసీగా, రగ్గడ్‌గా ఉంటుందని, అయినా సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తారని బుచ్చిబాబు ప్రశంసించారు. షూటింగ్ సమయంలో చరణ్ కారవాన్‌లోనే స్వయంగా మేకప్ బ్రష్‌తో టచ్ అప్ చేసుకునేవారని, అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఎంతో సింపుల్‌గా ఉండేవారని అన్నారు. సెట్‌లో ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడిందని ఎమోషనల్ అయ్యారు.

ఈ సినిమాలో జాన్వి పాత్ర చాలా రాడికల్ గా, విజయనగరం యాసలో బూతులు తిట్టే మాస్ క్యారెక్టర్‌గా ఉంటుందని, అది ప్రేక్షకులకు చాలా క్యూట్ గా అనిపిస్తుందని తెలిపారు. మొదటి నుంచి ఏఆర్ రెహమాన్‌తో పని చేయాలనేది తన డ్రీమ్ అని, ఈ కథకు గ్లోబల్ రీచ్ ఉండటంతో ఆయనే కరెక్ట్ అని ఎంచుకున్నట్లు బుచ్చిబాబు చెప్పారు. కథలో ఉన్న ఎమోషన్, డ్రామా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని బుచ్చిబాబు సానా ధీమా వ్యక్తం చేశారు. రంగస్థలం లాంటి చిత్రాలకు పార్ట్-2 అవకాశం ఉన్నట్లుగా, పెద్దికి కూడా భవిష్యత్తులో సీక్వెల్ చేసే ఆలోచన ఉందా అని బుచ్చిబాబును ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, పెద్ది కథ ఒకేసారి వస్తుంది. అది ఒకే పార్ట్‌లో ముగుస్తుంది, అని బుచ్చిబాబు స్పష్టంగా చెప్పారు. తాను రెండు పార్ట్‌లలో సినిమాలు తీయడాన్ని ఇష్టపడనని, ఒక కథను ఫినిష్ చేసేసి ఇంకో కథకి వెళ్లిపోవాలి అని తన ఆలోచనను పంచుకున్నారు. పెద్ది చిత్రానికి పార్ట్-2 సెట్ కాలేదని, అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన ధృవీకరించారు. దీంతో, రామ్ చరణ్ అభిమానుల్లో నెలకొన్న పార్ట్-2 ఉత్కంఠకు దర్శకుడు తెరదించారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us