AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton pickle : మటన్ ఊరగాయ పచ్చడి.. ఇలా చేస్తే ప్రతి ముద్ద అదిరిపోతుందంతే..!

మటన్ చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. ముఖ్యంగా చాలా మంది ఇష్టంగా తినేదాంట్లో మటన్ ముదుంటుంది. అయితే మటన్‌తో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేస్తుంటారు. అయితే దానితో ఇలా ఊరగాయ పచ్చడి పెడితే రుచి అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు మనం మటన్ ఊరగాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 03, 2026 | 3:02 PM

Share
 చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది మటన్ ఇష్టంగా తింటారు. అయితే మటన్‌తో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. కొంత మంది మటన్ ఫ్రై చేస్తే మరికొంత మంది మటన్ సూప్, మటన్ బిర్యానీ, మటన్ చిల్లీ, ఇలా అనేక రకాలు వంటకాలు చేస్తారు. వీటన్నింటి కంటే, మటన్‌తో ఊరగాయ పచ్చడి పెడితే నెల రోజులు అయినా సరే తినొచ్చంట. అంతే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. కాగా, మటన్ పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
మటన్ పచ్చడి పెట్టడానికి కావాల్సిన పదార్థాలు : బోన్‌లెస్ మటన్, వెల్లుల్లి రెబ్బలు కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మాసాలా పొడి, పసుపు, ఉప్పు, మెంతులు, లవంగాలు, కరివేపాకు, పచచి మర్చి, నిమ్మరసం, కారం, జీకర్ర. తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా బోన్ లెస్ మటన్ తీసుకోవాలి. దానిని నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు  కుక్కర్ తీసుకొని అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వేయాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మసాలాలు అన్నీ వేసి ముక్క చాలా మెత్తగా ఉడికే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి.

2 / 5
నీరు మొత్తం పోయి, ముక్క దేనికి అది విడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిని పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టాలి. అందులో నూనెపోసి, జీలకర్ర, లవంగాలు, రెండు పచ్చి మిర్చీలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు మంచిగా వేయించుకోవాలి.

3 / 5
ఇవి బాగా వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేయాలి. నూనెలో మంచిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.  తర్వాత ఇందులో మనం గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కచ్చా పచ్చాగా దంచి అందులో వేసుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం , ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
ముక్కలన్నింటికీ మసాలాలు కారం, ఉప్పు బాగా పట్టేలా చూసుకోవాలి. దాని కోసం గ్యాస్ మంటను తక్కువగా పెట్టి మంచిగా కలుపుతూ ఉండాలి. దీని వలన ముక్కలకు కారం ఉప్పు బాగా పడుతుంది. మంచిగా వేగి ముక్కలకు కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి,  పచ్చడిలో నిమ్మరసం పిండాలి. తర్వాత మంచిగా కలుపుకొని గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ ఊరగాయ పచ్చడి రెడీ.

5 / 5
Follow Us