Lakshya Friday: నాగశౌర్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… ఇకపై ప్రతీ శుక్రవారం ఒక అప్‌డేట్‌..

Lakshya Friday: 'చందమామ' కథలు సినిమాలో చిన్న క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నటుడు నాగశౌర్య. అనంతరం 'ఊహలు గుసగులసాడే' చిత్రంలో నటించిన అమ్మాయిలకు డ్రీమ్‌ బాయ్‌గా...

Lakshya Friday: నాగశౌర్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌... ఇకపై ప్రతీ శుక్రవారం ఒక అప్‌డేట్‌..
Lakshya Movie

Edited By: Ravi Kiran

Updated on: Jul 24, 2021 | 9:08 AM

Lakshya Friday: ‘చందమామ’ కథలు సినిమాలో చిన్న క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నటుడు నాగశౌర్య. అనంతరం ‘ఊహలు గుసగులసాడే’ చిత్రంలో నటించిన అమ్మాయిలకు డ్రీమ్‌ బాయ్‌గా మారారు. ఒకవైపు ‘జో అచ్చుతానంద’, ‘ఒక మనసు’, ‘ఛలో’ వంటి ఫీల్‌ గుడ్‌ మూవీస్‌లో నటిస్తూనే మరోవైపు ‘అశ్వథ్థామ’ వంటి యాక్షన్‌ చిత్రాల్లో నటిస్తూ తనలోని అన్ని కోణాలను పరిచయం చేస్తున్నాడు నాగశౌర్య. ఈ క్రమంలోనే తాజాగా ‘లక్ష్య’ అనే సినిమాతో మరోసారి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయడానికి వస్తున్నాడు. నాగశౌర్య 20వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఈసారి సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌ చిత్రంపై భారీగా అంచనాలు పెంచేసింది. నిజానికి ఈ సినిమా గత ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో నాగశౌర్య సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులు ఢీలా పడ్డారు. కనీసం సినిమాకు సంబంధించి టీజర్‌ కానీ ట్రైలర్‌ కానీ విడుదల చేయలేదు. దీంతో అలర్ట్‌ అయిన చిత్ర యూనిట్‌ తాజాగా నాగశౌర్య ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకపై ‘లక్ష్య’ సినిమా విడుదలయ్యే వరకు ప్రతీ శుక్రవారం సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ను ఇస్తామని ప్రకటించింది. #LAKSHYASFRIDAY అనే ట్యాగ్‌తో అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో నాగశౌర్య ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను తెరకెక్కిస్తున్నారు. త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో శౌర్యకు జోడిగా కేతిక శర్మ నటిస్తోంది.

Also Read: Krithi Shetty: లెక్క తేలింది.. ‘బేబమ్మ’ కిట్టీలో ప్రస్తుతం ఉన్న సినిమాలు ఇవే…

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కోసం రంగంలోకి బిగ్ బి.. ఈ నెల 24నుంచి షూటింగ్‌‌‌లో జాయిన్ అవ్వనున్న అమితాబ్

Jr.NTR-Ram Charan: తన ఖరీదైన కొత్త కారుతో ముందుగా మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లి సందడి చేసిన ఎన్టీఆర్..