కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో ఇటీవల ఒక విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి సరోజా సంజీవ్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా తన తల్లిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు సుదీప్. ఈ నేపథ్యంలో అతనికి ధైర్యం చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓ లేఖను పంపించారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీప్ ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ తల్లి సరోజా సంజీవ్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమె లోటు పూడ్చలేనిది. అమ్మ గొప్ప మనసును వర్ణించలేం. నువ్వు భావోద్వేగానికి గురైన క్షణాలు చూస్తుంటే ఆమెతో నీకున్న అనుబంధం.. నీపై ఆమె ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోంది. జ్ఞాపకాల రూపంలో ఆమె ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆమె నేర్పించిన విలువలు నీలో స్ఫూర్తి నింపుతూనే ఉండాలి. జీవితంలో ఇదొక క్లిష్ట సమయం. దీనిని అధిగమించే ధైర్యాన్ని ఆ భగవంతుడు నీకు, కుటుంబసభ్యులకు అందించాలని ప్రార్థిస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన సుదీప్ ‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు.. మీ సంతాప లేఖకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మీ ఆలోచనాత్మకమైన మాటలు నా మనసును తాకాయి. నాకెంతో ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చాయి. మీరు చూపించిన ఈ ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుంది’ అని రిప్లై ఇచ్చారు కిచ్చా సుదీప్.
Honarable @PMOIndia @narendramodi ji,
I am writing to sincerely thank you for this compassionate condolence letter. Your thoughtful words provide a source of comfort during this profoundly difficult time.
Your empathy has touched my heart deeply, and I am truly grateful for your… pic.twitter.com/u4aeRF8Sw3— Kichcha Sudeepa (@KicchaSudeep) October 28, 2024
.
తన తల్లి మరణం తరువాత, కిచ్చా సుదీప్ సినిమా, బిగ్ బాస్ షూటింగుల నుండి విరామం తీసుకున్నాడు. గత వారాంతంలో బిగ్ బాస్ ఎపిసోడ్‌కి సుదీప్ హోస్ట్ చేయలేదు. సరోజా సంజీవ్ మరణ వార్తను బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు కూడా తెలియజేశారు. విషయం తెలియగానే అందరూ కంటతడి పెట్టారు.
My mother , the most unbiased, loving, forgiving, caring, and giving, in my life was valued , celebrated, and will always be cherished.
*Valued… because she was my true god next to me in the form of a human.
*Celeberated… because she was my festival. My teacher. My true… pic.twitter.com/UTU9mEq944— Kichcha Sudeepa (@KicchaSudeep) October 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.