AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’ ఓపెన్‌గా చెప్పేసిన ఎన్టీఆర్..

టీనేజ్, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మనకు చాలా రకాల ఆకర్షణలు ఉంటాయి. మనం చేసే పని తప్పా, రైటా అనే సందేహం కూడా ఉంటుంది. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి ఓ ఇన్సిడెంట్ ఎన్టీఆర్ జీవితంలో జరిగింది.

Jr NTR:  'అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..' ఓపెన్‌గా చెప్పేసిన ఎన్టీఆర్..
Jr NTR
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2023 | 3:45 PM

Share

సీనియర్ ఎన్టీ రామారావు.. తెలుగు జాతిని గర్వపడేలా చేసిన వ్యక్తి. సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఆయన ఎంతో కీర్తిని సంపాదించుకున్నారు.  తాత రూపంతో పాటు ప్రతిభను సంతరించుకున్న చిన్న ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులో అగ్రనటుడిగా రాణిస్తున్నాడు. త్వరలో ఈయన పేరు పాన్ ఇండియాలో ప్రభలంగా వినిపిస్తుందన్నది చాలామంది ట్రేడ్ పండితులు మాట. డైలాగ్ చెప్పినా, డ్యాన్స్ వేసినా, ఫైట్ చేసినా.. ఎన్టీఆర్‌కు సెపరేట్ మార్క్ ఉంటుంది. సినిమాల పరంగా ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు తారక్. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అతడి నటనాస్థాయి ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రజంట్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్‌ కూడా ఎంతో సంతోషంగా సాగుతుంది. ఎంతో ప్రేమించే తల్లి, కుటుంబం మొత్తాన్ని ఆప్యాయంగా చూసుకునే భార్య, ముద్దైన ఇద్దరు తనయులతో ఎన్టీఆర్.. చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ సమయంలో తారక్ కూడా కాస్త పక్కచూపులు చూశారు. ఆయన ఓ హీరోయన్‌ను ఇష్టపడ్డారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సైతం అంగీకరించారు. అప్పట్లో గట్టిగానే దాని గురించి పబ్లిసిటీ చేశారని.. అలా ఓ దగ్గర ఏదో ఇష్టం కలిగిందని.. ఆ తర్వాత ఇది కాదేమో అనిపించిందని తారక్ చెప్పాడు. 23 ఏళ్ల వయస్సులో అది జరిగిందని.. అది పాసింగ్ ఫేజ్ అని తారక్ పేర్కొన్నాడు. దాని వల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదని.. చెప్పుకొచ్చారు. లైఫ్ లో తీసుకున్న ఏ నిర్ణయం పట్ల తాను బాధపడటం లేదని ఎన్టీఆర్ వెల్లడించాడు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు 100 రకాలుగా ఆలోచిస్తానని ఎన్టీఆర్ తెలిపారు.

ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను తాను అస్సలు కలపనని ఎన్టీఆర్ తెలిపాడు. ఇంటర్ చదివే సమయంలో.. కొన్ని రకాల కోతి వేషాలు ఉండేవని.. అవి అందరి లైఫ్‌లో కామన్ అన్నారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.