
సినీరంగంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆక్టటుకుని.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న కొందరు.. ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, విజయ్ దళపతి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. వెండితెరపై అద్భుతమైన నటనతో జనాలను హృదయాలను గెలుచుకున్న తారలు.. ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి ప్రజల మెప్పును పొందుతున్నారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవలే స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చూస్తూనే.. మరోవైపు ప్రజల వద్దకు ప్రయాణం చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. హీరో ధనుష్ సైతం రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. అందుకే అభిమానులతో కలిసి వారిని ఉత్సహపరిచేందుకు రెడీ అియనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రణాళికను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. సాలిగ్రామంలో ఓ స్టూడియోను ఏర్పాటు చేసి 25 వారాలపాటు వారానికి ఒక్కరోజు అభిమానులను కలుసుకునేందుకు బుక్ చేసినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా అభిమానులను కలుసుకుని.. వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారట ధనుష్. కానీ ఈ హీరో రాజకీయ ఎంట్రీ పై ఇప్పటివరకు సరైన స్పష్టత రాలేదు. ప్రస్తుతం ధనుష్ రాజకీయ ఎంట్రీ పై కోలీవుడ్ లో చర్చ జరుగుతుంది. ఇటీవలే కుబేర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ధనుష్.
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..