Renukaswamy Case: అప్పుడు సినిమా కోసం ఖైదీగా.. ఇప్పుడు నిజమైన ఖైదీగా ఆ జైలుకు వెళ్తున్న దర్శన్..

దర్శన్‌ని బెల్గాంలోని హిండలగ జైలుకు తరలించనున్నట్లు నిన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బళ్లారి సెంట్రల్ జైలుకు మార్చడంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అట్ట బళ్లారిలోని జైలులో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శన్ ను ఏ క్షణంలోనైనా తీసుకురావచ్చని బళ్లారి సెంట్రల్ జైలు అధికారులు అప్రమత్తమై జైలులో అన్ని ఏర్పాట్లు చేశారు.

Renukaswamy Case: అప్పుడు సినిమా కోసం ఖైదీగా.. ఇప్పుడు నిజమైన ఖైదీగా ఆ జైలుకు వెళ్తున్న దర్శన్..
Hero Darshan

Updated on: Aug 28, 2024 | 12:20 PM

పరప్ప అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించే విషయమై అధికారులు సీఎంకు సమాచారం అందించారు. కోర్టు అనుమతి తీసుకుని అతడిని తరలిస్తున్నట్లు సమాచారం. దర్శన్ విల్సన్ గార్డ్ నాగ సహా 18 మంది నిందితులను బళ్లారి సెంట్రల్ జైలు, బెల్గాం హిండలగ జైలుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి కోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. దర్శన్‌ని బెల్గాంలోని హిండలగ జైలుకు తరలించనున్నట్లు నిన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బళ్లారి సెంట్రల్ జైలుకు మార్చడంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అట్ట బళ్లారిలోని జైలులో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శన్ ను ఏ క్షణంలోనైనా తీసుకురావచ్చని బళ్లారి సెంట్రల్ జైలు అధికారులు అప్రమత్తమై జైలులో అన్ని ఏర్పాట్లు చేశారు.

9 బ్యారక్‌లున్న బళ్లారి జైలులో ప్రస్తుతం 385 మంది ఖైదీలు ఉన్నారు. సీసీ కెమెరాలతో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా కోర్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. జైల్లో అటాచ్డ్ బాత్‌రూమ్ ఉన్న సెల్స్ ఉన్నాయని, దర్శన్‌ను అవే సెల్స్‌లో ఉంచనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బళ్లారి జైలు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఒకప్పుడు అదే జైలులో దర్శన్ తన సినిమా షూటింగ్ చేశాడు. అందులో ఖైదీగా నటించి అలరించాడు. కానీ ఇప్పుడు అదే జైలుకు నిజమైన ఖైదీగా వెళ్తున్నాడు.

దర్శన్ నటించిన చౌక్ సినిమా షూటింగ్ బళ్లారి జైలులో జరిగింది. ఆ మూవీలో దర్శన్ బళ్లారి సెంట్రల్ జైలు ఖైదీగా నటించాడు. అయితే ఇప్పుడు తన అభిమాని హత్యకేసులో దోషిగా అదే జైలుకు నిజమైన ఖైదీగా వెళ్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. బళ్లారి జైలును 1884లో నిర్మించారు. ఇందులో 9 బ్యారక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ జైలులో 385 మంది ఖైదీలు ఉన్నారు. కోర్టు వ్యవహారాలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న సెల్స్ కూడా ఉన్నాయి. పేరుమోసిన బచ్చాఖాన్ అదే జైలులో ఉన్నాడు. ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న దర్శన్‌ కోసం భార్య, కొడుకు, సోదరుడు సహా కుటుంబ సభ్యులు వచ్చి చూసేవారు. రెండు మూడు గంటల్లోనే పరప్ప అగ్రహారానికి వెళ్లి దర్శన్‌తో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కానీ, ఇప్పుడు దర్శన్‌ని బళ్లారికి షిఫ్ట్‌ చేస్తే.. కుటుంబసభ్యులు కలవడం కష్టమే. బళ్లారి జైలులో కఠిన చర్యలు తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.