AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పవన్ కల్యాణ్ భుజాలపై ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? అమ్మాయిల కలల రాకుమారుడు..

చిరంజీవి, నాగ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా ముగ్గురు మెగా బ్రదర్స్ మధ్యలో క్యూట్ గా కనిపిస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా మారిపోయాడు. ఆరడుగుల హైట్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఇతర హీరోల్లా కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటాడు. వైవిధ్యమైన కథలతోనే ముందుకు వెళుతున్నాడు.

Tollywood: పవన్ కల్యాణ్ భుజాలపై ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? అమ్మాయిల కలల రాకుమారుడు..
Chiranjeevi family
Basha Shek
|

Updated on: Aug 28, 2024 | 12:18 PM

Share

చిరంజీవి, నాగ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా ముగ్గురు మెగా బ్రదర్స్ మధ్యలో క్యూట్ గా కనిపిస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా మారిపోయాడు. ఆరడుగుల హైట్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఇతర హీరోల్లా కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటాడు. వైవిధ్యమైన కథలతోనే ముందుకు వెళుతున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు కెరీర్ కొంచెం డల్ గా ఉన్నప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవడు అనుకుంటున్నారా? ఆ కుర్రాడు మరెవరో కాదు.. మెగా ప్రిన్స్, నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్. ఇది అతని చిన్నప్పటి ఫొటో. కాగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచే సుమారు డజనకు పైగా హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌ తదితరులు టాలీవుడ్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వరుణ్ తేజ్ ఇక్కడ చాలా స్పెషల్. కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యమైన కథలతో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా అపజయాలు ఎదురైనా కొత్త కొత్త కథలతో అభిమానుల ముందుకు వస్తున్నాడు.

గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు వరుణ్ తేజ్. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఏడడుగులు వేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ చివరిగా ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా అభిమానులను నిరాశపరిచింది.

ఇవి కూడా చదవండి

మట్కా సినిమాలో వరుణ్ తేజ్..

ప్రస్తుతం మట్కా చిత్రంలో నటిస్తున్నాడు మెగాప్రిన్స్. పలాస మూవీ దర్శకుడు కరుణ్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ గ్యాంగస్టర్ యాక్షన్ డ్రామాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

రక్షా బంధన్ వేడుకల్లో మెగా ప్రిన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..