Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత..
జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. అందులో ఓ కీలక పాత్రలోనూ ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, సహాయనటుడిగా.. తన యాక్టింగ్‌తో అలరించారు కాస్ట్యూమ్స్ కృష్ణ.
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ తెల్లవారుజామున చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కాస్ట్యూమ్స్ కృష్ణ. ఆ సినిమా తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. అందులో ఓ కీలక పాత్రలోనూ ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, సహాయనటుడిగా.. తన యాక్టింగ్‌తో అలరించారు కాస్ట్యూమ్స్ కృష్ణ.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.