AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmanandam: డబ్బు సంపాదించడానికి బ్రహ్మానందం చెప్పిన ఈజీ మార్గం.. ఇలా చేస్తే అసలు ఆర్థిక సమస్యలే రావట

టాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. అడపాదడపా మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక క్రమశిక్షణ గల వ్యక్తిగా బ్రహ్మానందం కు మంచి గుర్తింపు ఉంది. డబ్బు విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఉంటారంటారు.

Brahmanandam: డబ్బు సంపాదించడానికి బ్రహ్మానందం చెప్పిన ఈజీ మార్గం.. ఇలా చేస్తే అసలు ఆర్థిక సమస్యలే రావట
Actor Brahmanandam
Basha Shek
|

Updated on: Oct 18, 2026 | 10:57 AM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా తన హాస్యంతో ప్రేక్షకులకు వినోదం అందించారు స్టార్ అండ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం. కమెడియన్‌గా అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కారాయన. అయితే ఇప్పుడీ స్టార్ కమెడియన్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తన్నారు. అందులో భాగంగానే ఇటీవల అక్కినేని సుమంత్ నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ మూవీలో నెగెటివ్ రోల్ లో కనిపించి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. సినిమాలు, రికార్డుల సంగతి పక్కన పెడితే.. టాలీవుడ్ లో ఆర్థిక క్రమశిక్షణ గల వ్యక్తిగా బ్రహ్మానందంకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆయన నిక్కచ్చిగా ఉంటారన్న పేరుంది. ఈ క్రమంలో డబ్బు సంపాదన, ఆర్థిక క్రమిశిక్షణ గురించి వివిధ సందర్భాల్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రహ్మానందం. ‘డబ్బుని మనం ప్రేమిస్తే డబ్బు మనల్ని ప్రేమిస్తుంది. డబ్బుకి ప్రతి వాడు రెస్పెక్ట్ ఇవ్వాలి. భార్యామూలం మిదం గృహం, కృషి మూలం మిదం వ్యవసాయం, ధనం మూలం మిదం జగత్తు. కరోనా సమయంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూశారు. ఇతరుల కోసం చేతులు చాచే పరిస్థితి వచ్చింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇతరుల వద్ద చేయి చాచే పరిస్థితి రాకూడదు. అందుకే డబ్బుని మనం ప్రేమిస్తే, అది మనల్ని ప్రేమిస్తుంది. డబ్బు కొరత ఉండదు’ అని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.

ఇక మరో సందర్భంలో ఇదే విషయంపై మాట్లాడారు బ్రహ్మానందం.. ‘ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. సినిమా పరిశ్రమలో చాలామంది ఆర్థికంగా చేసిన తప్పులను చూసి, “ఏం చేయకూడదో” నేను నేర్చుకున్నా. డబ్బు విషయంలో నేను కచ్చితంగా ఉండటాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ అదే ఆర్థిక క్రమశిక్షణ వల్ల దాదాపు 23 మంది పేద ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించగలిగాను. నేనిలా సహాయం చేశామని ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం నాకు నచ్చదు. ‘సంపద అంటే అవసరమైన చోట ఉపయోగపడాలి’ అన్న భావనతోనే నేను జీవిస్తాను’ అని బ్రహ్మానందం తెలిపారు. ఇక చివరగా నిజమైన ధనవంతుడు ఎవరు? అనే ప్రశ్నకు ‘కోట్ల సంపద ఉన్నా నిద్రలేకపోతే ప్రయోజనం ఏమిటి? రోజంతా కష్టపడి ప్రశాంతంగా నిద్రపోయే వ్యక్తే నా దృష్టిలో నిజమైన కోటీశ్వరుడు’ అని హాస్యబ్రహ్మా చేసిన కామెంట్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us