
తెలుగు సినీ పరిశ్రమలో హాస్యబ్రహ్మగా చరగాని సంతకం చేశారు బ్రహ్మానందం. ఆయన పేరు వింటేనే ప్రేక్షకుల పెదవుల పై కొన్ని దశాబ్దాలుగా వందలాది సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోలతోపాటు పాపులారిటీ అందుకున్న కమెడియన్ ఆయన. అలాగే స్టార్ హీరోల కంటేఎక్కువగా పారితోషికం తీసుకున్న హాస్యనటుడు కావడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. తన ప్రత్యేకమైన ఎక్స్‌ప్రెషన్స్, పర్ఫెక్ట్ టైమింగ్, నవ్వించే డైలాగ్స్‌తో 30 ఏళ్లుగా కోట్లాది మంది అభిమానులను అలరించాడు. సినీ హాస్య ప్రపంచంలో ఆయన లెజెండ్ గా చేసింది తన అద్భుతమైన నటనే.
తెలుగు లెక్చరర్ అయిన బ్రహ్మానందం హాస్యం, యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉండడంతో సినీరంగంవైపు అడుగులు వేశారు. కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత లెజెండ్రీ కమెడియన్ గా మారారు. ఎంతో మందికి బ్రహ్మానందం గురువు. ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలో మీమర్స్ కు కూడా బ్రహ్మానందం గురువు అయ్యారు. నెటిజన్స్ బ్రహ్మానందంగారిని మీమ్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల బ్రహ్మానందం సినిమాల స్పీడ్ తగ్గించారు. అడపదడపా సినిమాలు చేస్తున్నారు బ్రహ్మానందం.
అలాగే పలు టీవీ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆహాలో లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు హాజరయ్యారు బ్రహ్మానందం..ఈ ఎపిసోడ్ లో బ్రహ్మానందం తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. కాగా ఈ ప్రోమో చివరిలో బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకోవడం చూడొచ్చు.. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి హోస్ట్ అడగ్గా.. ఆయనతో ఎంతో పెద్ద అనుబంధం ఉంది.. కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న మనిషి, మంచి మనిషి బాలసుబ్రహ్మణ్యం అంటూ చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి