Balakrishna: బాలకృష్ణకు పద్మ భూషణ్.. సినీరంగంలో ఎవరెవరికి వచ్చాయంటే..
నందమూరి హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. కళారంగంలో ఆయన చేసిన సేవలకుగానూ ఈ పురస్కారం ప్రకటించింది. వైద్య రంగం నుంచి దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ రంగం నుంచి పీఆర్ శ్రీజయ్యలకు పద్మ విభూషణ్ అవార్డ్స్ ప్రకటించింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందించి గౌరవించింది. ఈ నేపత్యంలోనే సినీరంగంలో ఎన్నో సేవలు అందించిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. ఈ విషయం తెలియగానే నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీరంగంలో బాలకృష్ణతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, అలాగే సీనియర్ హీరోయిన్ శోభనకు సైతం పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. కేంద్రం మొత్తంగా 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించారు. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.
ఇటీవలే సంక్రాంతి పండగ సందర్భంగా డాకు మహారాజ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు బాలకృష్ణ. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు బాలయ్య.
అలాగే హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే దుబాయ్ కారు రేసింగ్ లో ఆయన టీమ్ విజయం సాధించింది. అలాగే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శోభన.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం మలయాళంలో ఓ మూవీలో నటించింది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




